సెప్టెంబర్ 29 ఆదివారం, సిరిపురంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గల శ్రీ సీఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో చాణక్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది..
మ్యాచో స్టార్ గోపిచంద్ నటిస్తున్న 26వ సినిమా.. ‘చాణక్య’.. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించగా.. రెండోసారి మెహరీన్ గోపిచంద్ పక్కన నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. తిరు డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. చాణక్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 29 ఆదివారం, సిరిపురంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గల శ్రీ సీఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో చాణక్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది.
Read Also : రాయలసీమ లవ్ స్టోరీ – రివ్యూ..
దసరా కానుకగా అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ కానుంది. కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ : శ్రీ చరణ్ పాకాల, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తిరు.