Geetha Bhagat : ఆ ఇష్యూ మొదలైందే నా దగ్గర్నుంచి.. అసలు అది సమస్యే కాదు.. శివాజీ కామెంట్స్ పై స్పందించిన గీత భగత్..
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గీత భగత్ శివాజీ ఇష్యూ పై స్పందించింది. (Geetha Bhagat)
Geetha Bhagat
- గతంలో శివాజీ కామెంట్స్ వైరల్
- తాజాగా స్పందించిన యాంకర్ గీత భగత్
- డ్రెస్సింగ్ లో ఎవరిష్టం వాళ్ళది
Geetha Bhagat : ఇటీవల శివాజీ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకోండి అని మంచి మాటలు చెప్పినా ఓ రెండు అసభ్యకర పదాలు వాడటంతో అది పెద్ద వివాదమే అయింది. ప్రభాస్ రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ డ్రెస్, ఆమెతో అక్కడి జనాలు మిస్ బిహేవ్ చేయడం వల్లే శివాజీ ఈ కామెంట్స్ చేసారు. తాజాగా శివాజీ కామెంట్స్ పై యాంకర్ గీత భగత్ స్పందించింది.
సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేస్తూ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ గీతా భగత్. కెరీర్ మొదట్లో సినిమాల్లో కూడా నటించిన గీతా భగత్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. డ్రెస్సింగ్ విషయంలో యాంకర్ సుమ లాగే ఎక్కడా హద్దులు దాటకుండా ప్రతి ఈవెంట్, ఇంటర్వ్యూలో పద్దతిగా కనిపిస్తుంది గీత భగత్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గీత భగత్ శివాజీ ఇష్యూ పై స్పందించింది.
Also Read : Akhil Akkineni : అసలే హీరోగా సక్సెస్ లేదు.. ఇప్పుడు గెస్ట్ రోల్స్ అవసరమా?
యాంకర్ గీత భగత్ మాట్లాడుతూ.. వేరే వాళ్ళు డ్రెస్ లు అలా వేసుకోవడం వాళ్ళ ఛాయస్ అయితే మంచి బట్టలు వేసుకోవడం నా ఛాయస్. నేను చిన్నప్పనుంచి పంజాబీ డ్రెస్ లే వేసుకున్నాను. అయినా ఇది అంత పెద్ద ఇష్యూ అని కూడా నేను అనుకోవట్లేదు. మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమందికి ఇది సమస్య అనిపించి వాళ్ళు స్పందిస్తున్నారేమో.
శివాజీ గారు చెప్పిన మాటలతో ప్రాబ్లమ్ లేదు కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదేమో. అనసూయ గారు ఆలోచించినట్టు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించకపోవచ్చు. అసలు ఇదంతా మొదలైంది నిధి అగర్వాల్ ఇష్యూ నుంచే. నిధి అగర్వాల్ వచ్చిన ఆ ఈవెంట్ హోస్ట్ చేసేంది నేనే. ఆ రోజు జనాలు ఎక్కువగా వచ్చారు. నేనే 40 నిముషాలు ఈవెంట్ హోల్డ్ చేయడానికి కష్టపడ్డాను అని తెలిపింది.
