Chandra Siddarth : వామ్మో.. ఈ సినిమా టైటిల్ ఏంటి.. ఇంత పెద్దగా ఉంది..
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా ఆయన తన కొత్త సినిమాని ప్రకటించారు. (Chandra Siddarth)
- Saketh U
- Published on- September 6, 2026 / 02:05 PM IST
Chandra Siddarth
Chandra Siddarth : ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఇదీ సంగతి, ఆటగదరా శివా.. పలు హిట్ సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. తాజాగా ఆయన తన కొత్త సినిమాని ప్రకటించారు. అయితే ఈ సినిమా పేరు చాలా పెద్దదిగా ఉండటం గమనార్హం. చంద్ర సిద్దార్థ్ త కొత్త సినిమా టైటిల్.. ”ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అని పెట్టడం గమనార్హం. పైగా దీనికి సబ్ టైటిల్ గా.. ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అని పెట్టారు. మదన్ అందించిన కథతో ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ సినిమాని నిర్మించారు.
హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. భారత సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది. నా ఫ్రెండ్ మదన్ చనిపోయే ముందు అతను రాసిన కథతో నేను ప్లాన్ చేసిన సినిమా ఇది. ఓ ఊళ్ళో ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాం. ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ.. వంటి అంశాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ఈనెల 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. మిస్టరీ మ్యూజికల్ సినిమాగా ఉంటుంది అని తెలిపారు.
