Chandramukhi 2 : ఎంఎం కీర‌వాణి లీక్స్‌.. చంద్ర‌ముఖి-2లో 10 పాట‌లు..!

రాఘవ లారెన్స్(Raghava Lawrence), బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్(Kangana Ranaut) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం చంద్రముఖి-2.

Chandramukhi 2

Chandramukhi 2 – MM Keeravani : రాఘవ లారెన్స్(Raghava Lawrence), బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్(Kangana Ranaut) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం చంద్రముఖి-2. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో తెర‌కెక్కిన ‘చంద్ర‌ముఖి’ సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. వాసు (Vasu) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ఎంఎం కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా 19 సెప్టెంబ‌ర్ 2023న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Nayanthara : షారుక్ ఖాన్ కోసం మ‌న‌సు మార్చుకున్న న‌య‌న్‌..? ఏ విష‌యంలోనంటే..?

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఇటీవ‌ల మొద‌టి పాట‌ను రిలీజ్ చేసింది. ‘స్వాగ‌తాంజ‌లి’ అంటూ సాగే ఈ పాట‌లో కంగనా రనౌత్ నాట్యంతో ఆక‌ట్టుకుంది. సినిమాపై ఈ పాట అంచ‌నాల‌ను పెంచింది. ఎంఎం కీర‌వాణి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందిస్తున్నారు అన్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారంతో ఈ చిత్రానికి సంబంధించిన ఆయ‌న ప‌ని పూర్తి అయ్యింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తూ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న మొత్తం 10 పాట‌ల‌ను కంపోజ్ చేశార‌ట‌.

Gandeevadhari Arjuna Censored : వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సెన్సార్ పూర్తి.. ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారంటే..?

‘చంద్ర‌ముఖి 2 కోసం లాస్ట్ వ‌ర్కింగ్ డే. పీ వాసు సార్‌, లారెన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌తో జ‌ర్నీఅద్భుతంగా సాగింది. మిగిలిన 9 పాట‌ల విడుద‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.’ అంటూ కీర‌వాణి ట్వీట్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ మేము వెయిటింగ్ సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు