Gandeevadhari Arjuna Censored : వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) దర్శకుడు.

Gandeevadhari Arjuna
Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాజర్, విమలారామన్, వినయ్ రాయ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు సెన్సార్ బృందం ఈ చిత్రానికి పాజిటివ్‌గానే రెస్సాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయని సినిమా తప్పకుండా ప్రేక్షకుల అలరిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గాంఢీవధారి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా వరుణ్‌తేజ్ మరో సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లో 13వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
?????? & ?????? ✅@IAmVarunTej‘s Action Thriller #GandeevadhariArjuna Censored with ?/? ❤️?
Releasing In Worldwide Theaters On AUG 25th ?@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @JungleeMusicSTH@SVCCofficial#GDAonAugust25th pic.twitter.com/Yfw8eJ6R4v
— SVCC (@SVCCofficial) August 17, 2023