Priyanka Chopra : భర్త కన్సర్ట్‌లో స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ కనిపించిన ప్రియాంక చోప్రా.. ఫిదా అయిన ఫ్యాన్స్

ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా తన భర్త కన్సర్ట్‌లో ఈవెంట్ స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ బిజీగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Priyanka Chopra : భర్త కన్సర్ట్‌లో స్టాఫ్‌కి  స్నాక్స్ పంచుతూ కనిపించిన ప్రియాంక చోప్రా.. ఫిదా అయిన ఫ్యాన్స్

Priyanka Chopra

Updated On : August 17, 2023 / 2:28 PM IST

Priyanka Chopra : గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కొత్తేం కాదు. అయితే రీసెంట్‌గా ఆమె చేసిన పని రెడ్డిట్‌లో వైరల్ అవుతోంది. తన భర్త నిక్ జోనాస్ కన్సర్ట్‌లో ఈవెంట్ స్టాఫ్‌కి ఆమె స్నాక్స్ పంచుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆమె ధరించిన దుస్తులను చూసి అభినందిస్తున్నారు.

Nick Jonas : పబ్లిక్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా భర్తపై లో దుస్తులు విసిరిన ఆడియన్స్..
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ కన్సర్ట్‌లో స్టాఫ్‌కి స్నాక్స్ ఇస్తూ అందరి మనసులు గెలుచుకున్నారు. రెడ్డిట్‌లో షేర్ చేసిన వీడియోలో ప్రియాంక మినీ స్కర్ట్, హైహీల్స్‌తో సీక్విన్డ్ వైట్ క్రాప్ టాప్ ధరించి బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు. ఈవెంట్ స్టాఫ్‌గా ఉన్న ఓ మహిళకు స్నాక్స్ ప్యాకెట్లు పంచుతూ ప్రియాంక కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలామంది ప్రియాంక వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. స్టాఫ్ పట్ల ఆమె కనపరిచిన అభిమానానికి ఫిదా అయ్యారు.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్‌లో రిచర్డ్ మాడెన్ పక్కన కనిపించారు. ఈ సిరీస్‌లో జోష్ అప్పెల్‌బామ్, బ్రయాన్ ఓహ్, డేవిడ్ వెయిల్ డైరెక్ట్ చేశారు. త్వరలో ప్రియాంక కత్రినా కైఫ్, అలియా భట్‌లతో ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తున్న ‘జీలే జరా’ తో స్క్రీన్‌పై కనిపించనున్నారు.

Priyanka gets a lot of hate but she seems genuine and works very hard for how far she’s come
by u/ForeignSun14 in BollyBlindsNGossip