ఛపక్.. నాక్ జాక్ వీడియో సాంగ్ రిలీజ్

  • Publish Date - December 18, 2019 / 07:32 AM IST

బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న సినిమా ‘ఛపాక్‌’. 2005 ఢిల్లీలో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా నుంచి ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, బుధవారం (డిసెంబర్ 18, 2019)న నాక్ జాక్ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో దీపికా, యాసిడ్ దాడి తర్వాత అందహీనంగా తయారయ్యిన తన ముఖంతో సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఎదర్కుందో చూపించారు. 

ఇక ఈ చిత్రంతో దీపికా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఛపాక్.. జనవరి 10, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.