Mirai Pre Release Business : రేపే తేజ సజ్జా ‘మిరాయ్’ రిలీజ్.. ఎంత ఖర్చుపెట్టారు? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?
సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమా రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది. (Mirai Pre Release Business)

Mirai Pre Release Business
Mirai Pre Release Business : తేజ సజ్జా, రితిక నాయక్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా శ్రియ, జగపతి బాబు, జయరాం.. లాంటి చాలా మంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(Mirai Pre Release Business)
ఇప్పటికే మిరాయ్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వచ్చి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. మిరాయ్ సినిమా రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు దెబ్బకి ఒక్కసారిగా భారీగా పెరిగిన సేల్స్.. ఇది కదా మహేష్ రేంజ్ అంటే..
ఈ సినిమాకు 60 కోట్లకు పైగా ఖర్చుపెట్టారంట. అంత తక్కువ బడ్జెట్ లోనే గ్రాండ్ విజువల్స్ ఇచ్చారు. నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే మిరాయ్ సినిమాకు 45 కోట్లు వచ్చాయట. ఇక మిరాయ్ సినిమాని థియేట్రికల్ అమ్మకుండా అడ్వాన్స్ ల మీద రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి 16 కోట్లు, సీడెడ్ నుంచి 6 కోట్లు, నైజాం నుంచి 12 కోట్లు అడ్వాన్స్ లు తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా మొత్తం 5 కోట్లు, ఓవర్సీస్ 5 కోట్లకు అమ్మారు.
అంటే టోటల్ గా మిరాయ్ సినిమాకు ఆల్మోస్ట్ 44 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 45 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల వరకు గ్రాస్ రావాలి. మిరాయ్ సినిమా మీద ఉన్న హైప్ కి, టికెట్ రేట్లు తక్కువ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ఈజీగా 100 కోట్లకు పైగా మిరాయ్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also See : Dimple Hayathi : డస్కీ బ్యూటీ డింపుల్ హయతి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..