Tollywood Heroine : సినిమా పెద్ద హిట్.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చేసుకున్న హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సినిమాలో తన క్యారెక్టర్ పేరునే సోషల్ మీడియాలో తన పేరుగా మార్చేసుకుంది.(Tollywood Heroine)

Tollywood Heroine : సినిమా పెద్ద హిట్.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చేసుకున్న హీరోయిన్..

Tollywood Heroine

Updated On : September 11, 2025 / 8:34 AM IST

Tollywood Heroine : సినిమా హీరోలు, హీరోయిన్స్ పేర్లు మార్చుకోవడాలు, పేర్లలో లెటర్స్ మార్చుకోడాలు సాధారణమే. కొంతమందికి సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ పేరుకు ముందు చేరుతుంది. కానీ ఈ హీరోయిన్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సినిమాలో తన క్యారెక్టర్ పేరునే సోషల్ మీడియాలో తన పేరుగా మార్చేసుకుంది.(Tollywood Heroine)

సింగింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన తెలుగు అమ్మాయి శివాని నగరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవలే లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చింది శివాని. ఒక క్యూట్ లవ్ స్టోరీ, కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ కొట్టింది లిటిల్ హార్ట్స్. కేవలం 2 కోట్లతో ఈ సినిమా తీస్తే ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Tollywood Heroine

Also Read : NTR : ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. ఆ హీరో సినిమాలో ఎన్టీఆర్..? భారీ పాన్ ఇండియా ప్లానింగ్..

లిటిల్ హార్ట్స్ సినిమాలో సాంగ్స్, పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో శివాని కాత్యాయని ఆకుల అనే పాత్రలో నటించింది. కాత్యాయని పేరు మీద రెండు సాంగ్స్ ఉండటం, ఆ పాత్రలో శివాని మెప్పించడంతో ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కాత్యాయని అనే వైరల్ అవుతుంది.

శివాని తను చేసిన పాత్రకు ఇంత రెస్పాన్స్ రావడంతో ఆనందంలో ఉంది. దీంతో ప్రేక్షకులు ఈ పాత్రకు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ ఇకపై ఆ పేరు నా ఫేవరేట్. దాన్ని మరింత స్పెషల్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో శివాని పేరు ప్లేస్ లో కాత్యాయని ఆకుల అని పెట్టుకుంది. దీంతో శివాని ని అందరూ అభినందిస్తున్నారు.

Tollywood Heroine

Also See : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ.. ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

Tollywood Heroine