Tollywood Heroine
Tollywood Heroine : సినిమా హీరోలు, హీరోయిన్స్ పేర్లు మార్చుకోవడాలు, పేర్లలో లెటర్స్ మార్చుకోడాలు సాధారణమే. కొంతమందికి సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ పేరుకు ముందు చేరుతుంది. కానీ ఈ హీరోయిన్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సినిమాలో తన క్యారెక్టర్ పేరునే సోషల్ మీడియాలో తన పేరుగా మార్చేసుకుంది.(Tollywood Heroine)
సింగింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన తెలుగు అమ్మాయి శివాని నగరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవలే లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చింది శివాని. ఒక క్యూట్ లవ్ స్టోరీ, కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ కొట్టింది లిటిల్ హార్ట్స్. కేవలం 2 కోట్లతో ఈ సినిమా తీస్తే ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Also Read : NTR : ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. ఆ హీరో సినిమాలో ఎన్టీఆర్..? భారీ పాన్ ఇండియా ప్లానింగ్..
లిటిల్ హార్ట్స్ సినిమాలో సాంగ్స్, పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో శివాని కాత్యాయని ఆకుల అనే పాత్రలో నటించింది. కాత్యాయని పేరు మీద రెండు సాంగ్స్ ఉండటం, ఆ పాత్రలో శివాని మెప్పించడంతో ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కాత్యాయని అనే వైరల్ అవుతుంది.
శివాని తను చేసిన పాత్రకు ఇంత రెస్పాన్స్ రావడంతో ఆనందంలో ఉంది. దీంతో ప్రేక్షకులు ఈ పాత్రకు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ ఇకపై ఆ పేరు నా ఫేవరేట్. దాన్ని మరింత స్పెషల్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో శివాని పేరు ప్లేస్ లో కాత్యాయని ఆకుల అని పెట్టుకుంది. దీంతో శివాని ని అందరూ అభినందిస్తున్నారు.
Also See : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ.. ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..