‘ఛపాక్’ – ట్రైలర్ : దీపిక జీవించేసింది

యదార్థ సంఘటనల ఆధారంగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘ఛపాక్‌’ ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - December 10, 2019 / 08:16 AM IST

యదార్థ సంఘటనల ఆధారంగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘ఛపాక్‌’ ట్రైలర్ రిలీజ్..

 

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘ఛపాక్‌’. 2005లో ఢిల్లీలో యాసిడ్‌దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, గోవింద్ సింగ్ సంధు, మేఘన గుల్జార్‌తో కలిసి దీపికా నిర్మిస్తున్నారు.

మంగళవారం ‘ఛపాక్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. దీపిక లక్ష్మీ పాత్రలో జీవించేసింది. ఆమె మేకప్, పలికించిన హావభావాలు, చెప్పిన సంభాషణలు చూస్తుంటే.. ఈ సినిమా కోసం దీపిక మనసుపెట్టి పనిచేసిందనిపిస్తోంది. విక్రాంత్ మస్సే కీలక పాత్రలో నటించాడు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఛపాక్’ 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజిక్ : శంకర్-ఎహషాన్-లాయ్, సినిమాటోగ్రఫీ : మలయ్ ప్రకాష్, ఎడిటింగ్ : నితిన్ బెయిడ్.