కోట్లు ఖర్చుపెట్టాం.. దీనెబ్బా కరోనా.. బండ్ల గణేష్
కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన చికెన్ ధరలు.. స్పందించిన నటుడు, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్..
- sekhar
- Published On : March 31, 2020 / 10:26 AM IST
కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన చికెన్ ధరలు.. స్పందించిన నటుడు, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్..
కరోనా కారణంగా చికెన్ రేటు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. కానీ చికెన్ వల్ల కరోనా రాదని, అందరూ ఎంచక్కా కోడిమాంసం, కోడిగుడ్లు తినొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ రేట్లకు రెక్కలొచ్చాయి.. మాంసం ధరలు అన్నిచోట్లా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. వారం క్రితం వరకూ కిలో చికెన్ రూ. 100 లోపు దొరికింది. ఇప్పుడు రూ.200 పైగా పెరిగింది.
ఈ నేపథ్యంలో పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ‘మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. మీ సాయానికి కోటి దండాలు’ అంటూ కేసీఆర్, కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఆదివారం ట్వీట్ చేసిన బండ్ల తాజాగా సోమవారం మరో ఆసక్తికరమైన ట్వీట్ వదిలాడు. ‘మా పరిస్థితి ముందుకెళ్తే గొయ్యి.. వెనుకకి వెళ్తే నుయ్యిలా ఉంది. కోట్లు పెట్టుబడి పెట్టాం. భయంగా ఉంది.’ అంటూ కోడికి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు గణేష్.
Read Also : మేనల్లుడి మరణం.. బాధలో భాయ్‌జాన్..
దీంతో చికెన్ రేటు భారీగానే పెరిగిందిగా ఇంకెందుకు ఏడ్పు అంటూ బండ్ల గణేష్‌పై నెటిజన్లు పంచులు పేలుస్తున్నారు. ఇటీవల సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా చికెన్ వండుతున్న వీడియో షేర్ చేస్తూ థ్యాంక్స్ తెలిపిన గణేష్ కొంత విరామం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించాడు.
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ బండ్ల గణేష్ ?@TelanganaCMO pic.twitter.com/961A0NUJAf
— BANDLA GANESH (@ganeshbandla) March 27, 2020
@RKRojaSelvamani thank you so much ? pic.twitter.com/udOt109NdQ
— BANDLA GANESH (@ganeshbandla) March 28, 2020
మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టారము భయంగా వుంది దీయబ్బ కరోనా ????☠️ pic.twitter.com/mG9HjMxgTw
— BANDLA GANESH (@ganeshbandla) March 30, 2020
