చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ సాంగ్

చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ సాంగ్ రిలీజ్.

  • Publish Date - January 29, 2019 / 11:30 AM IST

చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ సాంగ్ రిలీజ్.

అథిత్ అరుణ్, మిర్చి హేమంత్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలి మొయిన్ లీడ్స్‌గా, బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై, సంతోష్ పి జయకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, చీకటి గదిలో చితక్కొట్టుడు.. టైటిల్ సంగతి పక్కన పడితే, మొన్నామధ్య రిలీజ్ చేసిన టీజర్ చూసిన ఆడియన్స్ మామూలుగా షాక్ అవ్వలేదు. టీజరే ఇంత బోల్డ్‌గా ఉంటే, సినిమా ఇంకెంత రసరమ్యంగా ఉంటుందోనని ఊహించేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం, ఇవాళ నేను తయారు చెయ్యబోయే రెసిపీ పేరు, ఆంథెమ్ ఆఫ్ పోర్న్ అని ఒక ఫిమేల్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ సాంగ్‌లోనూ అరాచకం ఓ రేంజ్‌లో ఉంది. యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఊపునిచ్చే లిరిక్స్‌ని కృష్ణకాంత్  రాయగా, నివాస్, యాజిన్ నిజార్, విష్ణుప్రియ రావి ఈ పాట పాడారు. బాలమురళి బాలు ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.

వాచ్ సాంగ్…