రెండో సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోలనూ కవర్ చేశాడుగా!

  • Publish Date - July 15, 2020 / 05:51 PM IST

“రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో వినూత్న సినిమాతో రాబోతున్నాడు. “ఎస్.ఆర్.కళ్యాణమండపం EST. 1975” అంటూ టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం తాజాగా హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు(జూలై 15) సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆన్ లైన్ ద్వారా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

“రాజావారు రాణిగారు” వంటి క్యూట్ లవ్ స్టోరీలో పక్కంటి కుర్రాడిలా అనిపించే రీతిలో తన నటనతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి కాస్త రూటు మార్చి తన లుక్‌కి మాస్ టచ్ ఇచ్చాడు. పూరీ విడుదల చేసిన అతి కొద్ది సమయంలోనే ఈ ఫస్ట్ లుక్‌కు డిజిటల్ మీడయాలో అనూహ్య స్పందన లభించడం విశేషం. క్లాస్ గెటప్, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించి ఆకట్టుకున్నాడు కిరణ్. ఇక తన రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవి, నటసింహా బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలను వాడేశాడు ఈ కుర్ర హీరో..

పోస్టర్లో కిరణ్ గొడ్డలి పట్టుకుని ఉండగా అతని వెనకున్న గోడకి బాలయ్య ట్రెండ్ సెట్టర్ అండ్ ఇండస్ట్రీ రికార్డ్ ‘సమరసింహారెడ్డి’ పోస్టర్ కనిపిస్తుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ పోస్టర్ కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేస్తే కానీ ఈ సంగతి గమనించలేం. పోస్టర్‌పై చిరు, బాలయ్య కనిపించడంతో సోషల్ మీడియాలో “ఎస్.ఆర్.కళ్యాణమండపం’’ మూవీకి మంచి ప్రమోషన్ లభిస్తోంది. లాక్‌డౌన్ విధించే స‌మయానికి క‌డ‌ప‌, రాయ‌చోటి ప‌రిస‌ర ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్ర‌కీర‌ణ పూర్తి చేసిన‌ట్లుగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఈ సినిమాతో శ్రీధ‌ర్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు.