Bholaa Shankar : చిరంజీవి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడా.. ఎప్పుడో.. తెలుసా..?
చిరంజీవి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైం అండ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అది ఎప్పుడు ఎక్కడా తెలుసా..?
- gum 95921
- Published on- August 3, 2023 / 06:16 PM IST
Chiranjeevi Bholaa Shankar pre release event details in telugu
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా భోళా శంకర్. తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరు చెల్లిలా పాత్రలో కనిపించబోతుంది. ఆగస్టు 11న రిలీజ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది.
Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్లో హీరోయిన్గా..
ఈ ఈవెంట్ ని ఈ ఆదివారం ఆగష్టు 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి ఎవరన్నా గెస్ట్ గా రాబోతున్నారా? లేదా? అనేది తెలియజేయలేదు. ఇక ఈ వార్త తెలియడంతో మెగా అభిమానులు ఈ మెగా ఈవెంట్ కి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కాగా భోళా శంకర్ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది. మహతి స్వర సాగర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Jailer : రజినీకాంత్ జైలర్ మూవీ.. ఆ సినిమాకి ఫ్రీమేక్ అంటా.. ట్రైలర్స్ కూడా దాదాపు సేమ్..
కాగా ఈ చిత్రంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చిరంజీవి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నాడు. అంతేకాదు పవన్ సినిమాలోని సీన్స్ అండ్ డైలాగ్స్ ని రీ క్రియేట్ చేస్తూ మూవీలో ఒక కామెడీ ట్రాక్ ని పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో మూవీ పై మరింత క్యూరియాసిటీ నెలకుంది. చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ మూవీ నుంచి కూడా అదే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు అభిమానులు. మరి మెహర్ రమేష్ వారి అంచనాలను చేరుకుంటాడా? లేదా? చూడాలి.
