Bholaa Shankar : ఇంద్ర లొకేషన్స్‌లో భోళా శంకర్ సాంగ్ షూటింగ్.. మరో దాయి దాయి దామ్మా!
ఇంద్రలోని 'దాయి దాయి దామ్మా' సాంగ్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే లొకేషన్స్ లో చిరు..
- gum 95921
- Published on- May 17, 2023 / 05:12 PM IST
Chiranjeevi Bholaa Shankar song shooting held at indra movie locations
Chiranjeevi Bholaa Shankar : వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. వీరయ్యతో ఆడియన్స్ కి వింటేజ్ చిరుని పరిచయం చేసి బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 230 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక భోళా శంకర్ లో కూడా చిరంజీవి నుంచి అటువంటి ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల చిరంజీవి కొల్కత్తా ఒక షెడ్యూల్ ని పూర్తి చేశారు మేకర్స్.
తాజాగా కొత్త షెడ్యూల్ ని స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మూవీలోని ఒక డ్యూయెట్ సాంగ్ ని అక్కడ షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా (Tamannaah) నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మహతి ఇచ్చిన మెలోడీ సాంగ్ ని చిరు అండ్ తమన్నా పై ఇంద్ర సినిమా లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇంద్రలోని ‘దాయి దాయి దామ్మా’ సాంగ్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!
మణిశర్మ సంగీతం అందించిన ఆ సాంగ్ కి చిరు వేసిన వీణ స్టెప్ ఎవర్ గ్రీన్ అంతే. ఇప్పుడు అదే లొకేషన్స్ లో సాంగ్ ని షూట్ చేస్తుండడం, మణిశర్మ తనయుడు సంగీతం అందిస్తుండడంతో అందరిలో ఆసక్తిని కలగజేస్తుంది. ఇక వర్షం పడి షూటింగ్ నిలిచిపోవడంతో.. మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ రూమ్ లో టీ ఎంజాయ్ చేస్తుంటే, చిరంజీవి మాత్రం వర్షంలో తిరుగుతూ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
