Chiranjeevi : చిరంజీవి అందుకే డైరెక్టర్స్ కి క్లాస్ పీకాడు.. ఇప్పుడు గోపీచంద్ రామబాణంలో కూడా అదే జరిగింది..

యూట్యూబ్ లో రామబాణం డిలిటెడ్ సీన్స్ అని కొన్ని వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 16 నిమిషాల ఫుటేజ్ ని అప్లోడ్ చేశారు. ఇంకా కొన్ని నిమిషాల ఫుటేజ్ ఉందని సమాచారం. అసలు స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంటే ఇంత ఫుటేజ్ వేస్ట్ అయ్యేది కాదు, ఇదంతా నిర్మాతకు లాస్.

Chiranjeevi : చిరంజీవి అందుకే డైరెక్టర్స్ కి క్లాస్ పీకాడు.. ఇప్పుడు గోపీచంద్ రామబాణంలో కూడా అదే జరిగింది..

Ramabanam movie get too much footage waste after final cut chiranjeevi comments goes viral again

Ramabanam :  ఇటీవల అఖిల్(Akhil) ఏజెంట్(Agent) సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ కి వెళ్లామని చెప్పి ఇండైరెక్ట్ గా డైరెక్టర్ మీద కామెంట్స్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy), రచయిత వక్కంతం వంశీ కేవలం ఒక లైన్ ని పట్టుకొని సరైన స్క్రీన్ ప్లే లేకుండానే షూట్ కి వెళ్లి, నిర్మాతల డబ్బులు వేస్ట్ చేశారని తెలుస్తుంది.

కొన్నాళ్ల క్రితం ఆచార్య(Acharya) సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి(Chiranjeevi) కూడా పలు సినిమా ఈవెంట్స్ లలో డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేశారు. డైరెక్టర్స్ సెట్ కి వచ్చి డైలాగ్స్ రాస్తున్నారని, అప్పటికప్పుడు స్క్రీన్ ప్లే, కథని మార్చుకుంటున్నారని కామెంట్స్ చేశారు. ఇవి టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా మూడు, నాలుగు సార్లు డైరెక్టర్స్ గురించి చిరంజీవి కామెంట్స్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయిన తర్వాత కూడా డైరెక్టర్స్ ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చిరంజీవి కామెంట్స్ చేశారు. నిర్మాతల డబ్బులు వేస్ట్ చేయొద్దని, సీన్స్ ని పేపర్ మీద పూర్తిగా ఫైనల్ అనుకున్న తర్వాతే షూట్ కి వెళ్ళమని, ఇష్టమొచ్చింది షూట్ చేసి ఆ తర్వాత కట్ చేసి, నిర్మాతల డబ్బులు పోగొట్టొద్దని డైరెక్టర్స్ కి సలహాలు ఇచ్చారు మెగాస్టార్.

అయితే అప్పుడు చిరంజీవి ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకున్నా, ఆయన చెప్పేది నిజమే అని అఖిల్ సినిమా తర్వాతే చాలా మంది భావించారు. ఇప్పుడు రామబాణం సినిమా విషయంలో కూడా చిరంజీవి చెప్పింది 100 శాతం నిజమే అని భావిస్తున్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం పరాజయంగానే మిగిలింది. అయితే గతంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా షూట్ చేసినా ఎడిటింగ్ లో కొంచెం ఎక్కువే కట్ చేశారు, వద్దనుకున్నా కొన్ని షూట్ చేసి పెట్టుకుందాం అని డైరెక్టర్ అన్నట్టు గోపీచంద్ తెలిపారు.

ఇప్పుడు యూట్యూబ్ లో రామబాణం డిలిటెడ్ సీన్స్ అని కొన్ని వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 16 నిమిషాల ఫుటేజ్ ని అప్లోడ్ చేశారు. ఇంకా కొన్ని నిమిషాల ఫుటేజ్ ఉందని సమాచారం. ఆ వీడియోలలో కొన్ని అయితే అసలు సినిమా స్క్రీన్ ప్లేలో ఎక్కడా సెట్ అవ్వవు, మరి ఎందుకు షూట్ చేసినట్టు అని అనుకుంటున్నారు. దీంతో ఇదంతా కూడా ఎలాంటి ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ షూట్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. అసలు స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంటే ఇంత ఫుటేజ్ వేస్ట్ అయ్యేది కాదు, ఇదంతా నిర్మాతకు లాస్. ఎడిటింగ్ లో కట్ చేసే ఫుటేజ్ మొత్తం కోట్లలోనే ఉంటుంది. అందుకే చిరంజీవి అనుభవంతోనే అప్పుడు డైరెక్టర్స్ కి క్లాస్ పీకాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి, శ్రీవాస్ మరోసారి ఇలా చేసి ఫ్లాప్స్ చూడటమే కాక నిర్మాతలకు కూడా డబ్బులు వేస్ట్ చేసి భారీ నష్టాన్ని మిగిల్చారు.

Akhil : ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన అఖిల్.. ఏమన్నాడో తెలుసా?

దీంతో టాలీవుడ్ లో మరోసారి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. నిజంగానే దర్శకులు కరెక్ట్ ప్లాన్ లేకుండా, సరైన స్క్రిప్ట్ లేకుండా షూట్ కి వెళ్ళిపోయి, అక్కర్లేనిది షూట్ చేసి నిర్మాతల డబ్బులు వేస్ట్ చేస్తున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు. నిర్మాతలు మరోసారి షూట్స్ కి వెళ్లేముందు అన్ని చెక్ చేసుకోవాలని భావిస్తున్నారు.