Akhil : ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన అఖిల్.. ఏమన్నాడో తెలుసా?

నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ ఫ్లాప్ అని ఒప్పుకుంటూ ఓ ప్రెస్ నోట్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు. తాజాగా అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించారు. ఏజెంట్ ఫ్లాప్ పై స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Akhil : ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన అఖిల్.. ఏమన్నాడో తెలుసా?

Akhil first reaction on Agent movie Flop

Agent : అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించిన సినిమా ఏజెంట్. ఏప్రిల్ 28న భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. కానీ ఏజెంట్ సినిమా ప్రేక్షకులని, అభిమానులని మెప్పించలేక భారీ పరాజయం పాలైంది.

ఏజెంట్ ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ మార్కెట్ లేని హీరో మీద అంత బడ్జెట్ పెట్టి భారీ డిజాస్టర్ అవ్వడంతో అఖిల్, డైరెక్టర్ ని, నిర్మాతను కూడా ట్రోల్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ ఫ్లాప్ అని ఒప్పుకుంటూ ఓ ప్రెస్ నోట్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు. తాజాగా అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించారు. ఏజెంట్ ఫ్లాప్ పై స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Agent : అయ్యగారి ఏజెంట్ అప్పుడే ఓటీటీలోకా.. మరీ ఇంత తక్కువ టైంలోనా.. డబ్బులు బొక్క అంటూ ట్రోల్స్..

ఈ నోట్ లో.. ఏజెంట్ సినిమాకు ప్రాణం పోయడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన నటీనటులకు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మేము మా స్థాయిలో చాలా బాగా అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా మేము అనుకున్నట్టు తెరపై మెప్పించలేకపోయింది. మీ కోసం మేము మంచి సినిమాను అందించలేకపోయాము. నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాపై, మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్స్, మాకు సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. మీరిచ్చే ప్రేమ, శక్తి నన్ను ఇంకా పనిచేసేలా చేస్తున్నాయి. నన్ను నమ్మిన వారికోసం నేను మళ్ళీ బలంగా తిరిగివస్తాను అని తెలిపారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక అఖిల్ ఏజెంట్ సినిమా మే 19 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

View this post on Instagram

A post shared by Akhil Akkineni (@akkineniakhil)