Agent : అయ్యగారి ఏజెంట్ అప్పుడే ఓటీటీలోకా.. మరీ ఇంత తక్కువ టైంలోనా.. డబ్బులు బొక్క అంటూ ట్రోల్స్..

ఏజెంట్ సినిమా కూడా త్వరగానే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ మరీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.

Agent : అయ్యగారి ఏజెంట్ అప్పుడే ఓటీటీలోకా.. మరీ ఇంత తక్కువ టైంలోనా.. డబ్బులు బొక్క అంటూ ట్రోల్స్..

Akhil Agent movie streaming in Soni Liv ott from may 19th

Updated On : May 3, 2023 / 7:13 AM IST

Agent :  అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించిన సినిమా ఏజెంట్. అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజయింది. భారీ అంచనాలు, ఆశలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని మెప్పించలేక పరాజయం పాలైంది.

ఏజెంట్ సినిమా మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా పరాజయాన్ని ఒప్పుకుంటూ నిర్మాత అనిల్ సుంకర కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజ్ అయిన 30 నుంచి 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏజెంట్ సినిమా కూడా త్వరగానే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ మరీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.

ఏజెంట్ సినిమా సోనీ లివ్ ఓటీటీలో రానున్నట్టు ముందే ప్రకటించారు. తాజాగా పలువురు నెటిజన్లు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అని సోని లివ్ ని ట్విట్టర్ లో ప్రశ్నించగా సోని లివ్ దీనికి సమాధానమిస్తూ ఏజెంట్ సినిమా మే 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అని తెలిపింది. అంటే సినిమా రిలీజయిన 22 రోజుల్లోనే ఏజెంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో పలువురు ప్రేక్షకులు, నెటిజన్లు మరోసారి సినిమాని ట్రోల్ చేస్తున్నారు.

LGM : ధోని సినిమా అప్పుడే షూటింగ్ అయిపోయిందా??

ఇంత తొందరగా ఓటీటీలోకి ఇస్తారని తెలిస్తే అసలు థియేటర్ కి వెళ్ళేవాడిని కాదు, 300 డబ్బులు బొక్క అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి 300 టికెట్ రేటు చాలా ఎక్కువ అనుకుంటే ఇంత త్వరగా ఓటీటీలోకి ఇచ్చి మేము అనవసరంగా థియేటర్ కి వెళ్లి చూశాం అనిపించేలా చేశారు అని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఏజెంట్ సినిమా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఓటీటీలో అయినా ఏజెంట్ సినిమా కనీసం వ్యూస్ దక్కించుకుంటుందా చూడాలి.