LGM : ధోని సినిమా అప్పుడే షూటింగ్ అయిపోయిందా??
ధోని భార్య సాక్షి ఈ నిర్మాణ సంస్థ వ్యవహారాలు చూసుకుంటుంది. లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) అనే టైటిల్ తో లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అధికారికంగా తెలిపారు.

Dhoni LGM Movie shoot completed
LGM : ధోని ఇటీవల సినిమా నిర్మాణంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి తమిళ్ లో తన మొదటి సినిమాని అనౌన్స్ చేశాడు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా రమేష్ తమిళమణి దర్శకుడిగా కొన్ని రోజుల క్రితమే సినిమాను ప్రకటించారు. ఇందులో నదియా, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ధోని భార్య సాక్షి ఈ నిర్మాణ సంస్థ వ్యవహారాలు చూసుకుంటుంది. లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) అనే టైటిల్ తో లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అధికారికంగా తెలిపారు. సెట్ లో చిత్రయూనిట్ షూట్ పూర్తయినందుకు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో హీరో, హీరోయిన్స్ తో పాటు చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. అలాగే షూట్ అయిపోయినందుకు సపరేట్ పార్టీ కూడా నిర్వహించారు. దీంట్లో కూడా చిత్రయూనిట్ అంతా పాల్గొని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అప్పుడే ఇంత ఫాస్ట్ గా ధోని నిర్మించే సినిమా షూటింగ్ అయిపోయిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ధోని నిర్మించే మొదటి సినిమా కావడంతో LGM పై అంచనాలు బాగానే ఉన్నాయి. IPL లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎన్నో ఏళ్లుగా ఆడుతూ తమిళనాడుతో, చెన్నైతో ధోనికి మంచి సంబంధం ఏర్పడింది. అందుకే తమిళ్ లోనే తన మొదటి సినిమా తీస్తున్నాడు. LGM సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. మరి మొదటి సినిమా నిర్మాతగా ధోనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
It’s a wrap on the shoot for #LGM. Loads of memories, laughs and relationships to cherish.
We are getting closer to see you in cinemas! pic.twitter.com/6EY2ywF1No
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 2, 2023