Sreeja Konidela : నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ.. చిరంజీవి కూతురు వీడియో వైరల్..
రెండు రోజుల క్రితం శ్రీజ ఓ వీడియో షేర్ చేసింది. అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (Sreeja Konidela)
- Saketh U
- Published on- June 10, 2026 / 03:32 PM IST
Sreeja Konidela
Sreeja Konidela : చిరంజీవి రెండో కూతురు శ్రీజ గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన మొదటి పెళ్లి, అతనితో విడాకులు. రెండో పెళ్లి, అతనితో కూడా విడాకులు అయి శ్రీజ వార్తల్లో వైరల్ అయింది. ప్రస్తుతం శ్రీజ సొంతంగా బిజినెస్ చేసుకుంటూనే తండ్రి సపోర్ట్ తో తన ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది. కొన్ని రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న శ్రీజ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయింది.
రెండు రోజుల క్రితం శ్రీజ ఓ వీడియో షేర్ చేసింది. అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : Pawan Kalyan : ఆ రెండు సినిమాలు నచ్చాయంటున్న పవన్ కళ్యాణ్.. నేషనల్ పాడ్ కాస్ట్ లో ఏం చెప్పారంటే..
ఈ వీడియోల్లో శ్రీజ మాట్లాడుతూ.. ఒకప్పుడు నా జీవితంలో జరిగిన తప్పులే నా గుర్తింపు అనుకున్నాను. కానీ అది తప్పని తెలుసుకున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను, ఒకదాని వెంట ఒకటి నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అనుకునేదాన్ని. నేను ఒక బాధితురాలిగా మిగిలిపోయాను అనుకున్నాను. కానీ బాధ నాలో ఒక భాగమే. అదే జీవితం కాదు అని తెలుసుకున్నాను.
అలాంటి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాను. శ్రీ పీఠం వ్యవస్థాపకురాలు అనురాధా రమేష్ ఆధ్వర్యంలో నేను చేసిన 15 నెలల ‘సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్’ నా ఆలోచనలను మార్చేసింది. జీవితం ప్రశాంతంగా ఉంది. మనిషిలో ఇంకా లేయర్లు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. నా జీవితాన్ని నేను నిర్మించుకోగలను అనే ధైర్యాన్ని ఇచ్చింది అని తెలిపింది. దీంతో శ్రీజ మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి.
