Pawan Kalyan : ఆ రెండు సినిమాలు నచ్చాయంటున్న పవన్ కళ్యాణ్.. నేషనల్ పాడ్ కాస్ట్ లో ఏం చెప్పారంటే..
తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు. (Pawan Kalyan)
pawan kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా నేషనల్ మీడియాకు పాడ్ కాచ్ ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్. ఈ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు సినిమాల గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు.
ఇందులో నేషనలిస్ట్ సినిమాల గురించి ప్రశ్నించగా పవన్ రెండు సినిమాల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు ధురంధర్ సినిమా నచ్చింది. అలాగే బారాముల్లా సినిమా కూడా నచ్చింది అని తెలిపారు.
Also Read : Balakrishna : ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్.. పుట్టిన రోజు నాడు బాలయ్య కీలక ప్రకటన..
ధురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పార్ట్ 2 అయితే మరింత భారీ విజయం సాధించింది. పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ వాళ్ళతో కలిసిపోయిన ఓ ఇండియన్ గూడాచారి కథగా ధురంధర్ దేశభక్తి సినిమాగా తెరకెక్కింది. రణవీర్ సింగ్ తన పర్ఫార్మెన్స్ తో అందరిని ఇంప్రెస్ చేసాడు.
ఇక బారాముల్లా సినిమా తీవ్రవాదం, హారర్ థ్రిల్లర్ అంశాలు కలిసి కొత్త జానర్లో తెరకెక్కింది. ఈ సినిమా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో గత సంవత్సరం రిలీజయి మంచి విజయం అందుకుంది. పవన్ ఈ రెండు సినిమాలు నచ్చాయని చెప్పడంతో ఇప్పటికే దురంధర్ అందరికి తెలుసు కాబట్టి ఫ్యాన్స్ బారాముల్లా గురించి వెతుకుతున్నారు. ఈ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
