Chiranjeevi : మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి.. మెగాస్టార్ ఏమి చెప్పారు..
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. మరి ఆ మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి..? మెగాస్టార్ ఏమి చెప్పారు..?
- gum 95921
- Updated on- June 30, 2023 / 04:19 PM IST
Chiranjeevi emotional comments on his grand daughter birth
Chiranjeevi – Ram Charan : టాలీవుడ్ లో మెగా సంబరాలు మొదలయ్యాయి. మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన (Upasana) పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. గత పది ఏళ్లగా ఈ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం నిజం అవ్వడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు జూన్ 20 ఉదయం 1:49 కి పాప జన్మించింది. ఇక ఈ మెగా ప్రిన్స్ ని చూసేందుకు మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.
ఇక మెగా ప్రిన్స్ గురించి మెగాస్టార్ మీడియాతో మాట్లాడారు. “ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్లిద్దరూ ఒక బిడ్డని మా చేతిలో పెడతారని ఎదురు చూస్తున్నాము. ఆ కోరిక ఇప్పుడు నెరవేరేంది. అందుకే ఈ ఆడబిడ్డ పుట్టాక మాకు ఎంతో అపురూపం. అలాగే మేము నమ్ముకున్న ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతివంతమైన రోజు మంగళవారం నాడే పాప జన్మించడం కూడా అపురూపంగా భావిస్తున్నాము” అంటూ వ్యాఖ్యానించారు.
Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!
ఇక మెగా వారసురాలికి ఎవరి పోలిక వచ్చింది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, చిరంజీవి బదులిస్తూ.. “అది ఇంకా చెప్పలేము. రాత్రి చూశాను కానీ ఆ పోలికలు అప్పుడే చెప్పలేను” అంటూ బదులిచ్చాడు. కాగా మెగా ప్రిన్సెస్ ని చూసేందుకు అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ సతీసమేతంగా హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇక హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు భారీగా చేరుకొని సందడి చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులు రామ్ చరణ్ అండ్ ఉపాసనకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
