×
Ad

Chiranjeevi : సెట్ లో డ్యాన్స్ స్టెప్స్ మర్చిపోయిన మెగాస్టార్.. చిరు కూతురు కామెంట్స్ వైరల్..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.(Chiranjeevi)

  • Published On : September 10, 2025 / 09:36 PM IST

Chiranjeevi

Chiranjeevi : అసలు మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్స్ కి పెట్టింది పేరు. ఒక్కసారి స్టెప్స్ చూస్తే అట్టే వేసేస్తారు. అలాంటిది ఆయన డ్యాన్స్ స్టెప్స్ మర్చిపోయారంట షూటింగ్ లో. తాజాగా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.(Chiranjeevi)

నేడు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల గెస్ట్ గా హాజరయ్యారు. స్టేజిపై సుస్మిత మాట్లాడిన అనంతరం సుమ చిరంజీవి గారు మీ అమ్మకు భయపడతారా అని సరదా ప్రశ్న అడగ్గా సుస్మిత నేడు జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపింది.

Also See : Varun Tej Lavanya Tripathi : మెగా వారసుడొచ్చాడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు..

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఇవాళ శంకర వరప్రసాద్ సినిమా సాంగ్ షూట్ చేస్తున్నాం. ఇవాళ షూట్ ప్లేస్ కి మా అమ్మ వచ్చింది. అప్పటిదాకా నాన్న డ్యాన్స్ బాగానే చేస్తున్నారు. అమ్మ వచ్చి కూర్చోగానే స్టెప్ అటు ఇటు అవ్వడం, స్టెప్స్ మర్చిపోవడం చేసారు. అమ్మ నాన్నను కొంచెం ఎఫెక్ట్ అయితే చేసింది అని అర్ధం అవుతుంది అని తెలిపింది. దీంతో ఎంత మెగాస్టార్ అయినా భార్యకు భయపడతారన్నమాట అని సుమ సరదాగా కామెంట్ చేసింది.

చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Also Read : Chiranjeevi : తండ్రి అయిన వరుణ్ తేజ్.. మనవడితో మెగాస్టార్.. చిరంజీవి పోస్ట్ వైరల్..