Chiranjeevi : తండ్రి అయిన వరుణ్ తేజ్.. మనవడితో మెగాస్టార్.. చిరంజీవి పోస్ట్ వైరల్..

నేడు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.(Chiranjeevi)

Chiranjeevi : తండ్రి అయిన వరుణ్ తేజ్.. మనవడితో మెగాస్టార్.. చిరంజీవి పోస్ట్ వైరల్..

Chiranjeevi

Updated On : September 10, 2025 / 4:22 PM IST

Chiranjeevi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 లో పెళ్లి చేసుకోగా ఇటీవల కొన్ని నెలల క్రితం ఈ జంట త్వరలో తాము తల్లి తండ్రులు కాబోతున్నామని, లావణ్య ప్రగ్నెంట్ అని ప్రకటించారు. నేడు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.(Chiranjeevi)

లావణ్యకు బాబు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్ కి వెళ్లి మరీ ఆ బాబుని చూసి వరుణ్ – లావణ్య జంటకు అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్ కూడా తన ఆనందాన్ని పెదనాన్న చిరంజీవితో పంచుకున్నారు. చిరంజీవి వరుణ్ తేజ్, ఇప్పుడే పుట్టిన బాబు కలిసి దిగిన ఫోటోని చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also Read : Bellamkonda Sreenivas : హిట్ కొట్టినా హ్యాపీనెస్ లేదు.. నేను ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికి వెళ్ళను.. బెల్లంకొండ వ్యాఖ్యలు వైరల్..

మెగాస్టార్ చిరంజీవి ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఈ చిన్ని బాబుకు ప్రపంచంలోకి స్వాగతం. కొణిదెల కుటుంబంలోకి ఇప్పుడే పుట్టిన బాబుకు స్వాగతం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తల్లి తండ్రులు అయినందుకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజలు గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉంది. బేబీ బాయ్ సంతోషంగా, మంచి హెల్త్ తో ఉండాలి. మా బాబు పై ఎప్పుడూ మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఉండాలి అంటూ పోస్ట్ చేసారు. ఇక వరుణ్ – లావణ్య జంటకు ఫ్యాన్స్ , నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Also Read : Varun Tej – Lavanya : మెగా ఫ్యామిలీలో సందడి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. తండ్రి అయిన వరుణ్ తేజ్..