Bellamkonda Sreenivas : హిట్ కొట్టినా హ్యాపీనెస్ లేదు.. నేను ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికి వెళ్ళను.. బెల్లంకొండ వ్యాఖ్యలు వైరల్..
కిష్కింధపురి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Bellamkonda Sreenivas)

Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ మాస్, యాక్షన్, కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. కానీ ఇటీవల కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో సరికొత్త కథలతో తో వస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి చేసిన హారర్ సినిమా కిష్కింధపురి సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Bellamkonda Sreenivas)
ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను 19 ఏళ్లకే హీరో అయ్యాను. అప్పుడు నాకు ఏమి తెలియదు. ఈ సినిమా చెయ్యి అంటే చేసేసేవాడిని. చాలా సినిమాలు అలాగే చేశాను. రాక్షసుడు సినిమా హిట్ అయింది కానీ నాకు హ్యాపినెస్ లేదు. ఎందుకంటే అది రీమేక్. ఆ సినిమాని అందరూ అభినందించారు కానీ నేను సంతోషంగా లేను. ఎప్పటికైనా ఒక స్ట్రైట్ ఫిలిం తో పెద్ద హిట్ కొట్టాలని ఉంది. భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చాను కానీ అది కూడా రీమేక్. ఇప్పుడు కిష్కింధపురి మాత్రం హారర్ థ్రిల్లర్. ఒరిజినల్ కథతో వస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు.
అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ఈ సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ఎవ్వరూ ఫోన్ చూడరు. మా సినిమా అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. సినిమా చూడకుండా ఎవరైనా ఫోన్ ఓపెన్ చేస్తే నేను సినిమాలు మానేస్తాను అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు ట్రోల్ చేయగా, పలువురు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా దీనిపై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందిస్తూ.. నేను ఒకరకంగా చెప్తే అది ఇంకోలా వెళ్ళింది. నేను సినిమాలు మానేయాను. నేను సినిమాలు మానేసి ఎక్కడికి వెళ్ళను. నేను పుట్టింది పెరిగింది అంతా సినిమాల్లోనే. నేను ఎందుకు సినిమాలు వదిలేస్తాను. అయినా నా సినిమానే కాదు ఏ సినిమా అయినా థియేటర్లో సినిమా చూడకుండా ఫోన్ చూడటం ఎందుకు అని అన్నారు.
Also Read : Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..