Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

మంచు మనోజ్ ఒకానొక సమయంలో చనిపోవాలని అనుకున్నాడట. (Manchu Manoj)

Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

Manchu Manoj

Updated On : September 10, 2025 / 3:24 PM IST

Manchu Manoj : మంచు మనోజ్ మధ్యలో కొన్నాళ్ళు పర్సనల్ సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండగా ఇప్పుడిప్పుడే మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించగా ఇప్పుడు మిరాయ్‌ సినిమాలో విలన్ గా రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు మనోజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకానొక సమయంలో ఈ జీవితం చాలు అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.(Manchu Manoj)

మంచు మనోజ్ మాట్లాడుతూ.. మా వైఫ్, మా అక్క, మా అమ్మ నాకు అన్ని సమయాల్లో సపోర్ట్ గా నిలబడ్డారు. నేను బాధపడితే నా క్లోజ్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తాను. ఒకానొక సమయంలో నేను బాధపడుతూ ఎవరితో ఏమి మాట్లాడకుండా నాకు ఈ జీవితం చాలు అనుకున్నాను. మా అక్క(మంచు లక్ష్మి) నా గురించి ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనుకొని భయపడింది. దాంతో అక్క నన్ను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమంది. నేను అక్క మీద అరిచేసాను. నేను బాధపడుతుంటే పిచ్చి, సైకో అనుకుంటున్నావా థెరపీ దగ్గరకు వెళ్ళమంటున్నావు అని ఫైర్ అయ్యాను అక్క మీద. ఆ సమయంలో నాకు బతకాలని లేదు. లోకం అంతా తప్పు, ఎవరూ కరెక్ట్ గా లేరు అనిపించేది.

Also See : Puri Sethupathi Film : విజయ్ సేతుపతి సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిన పూరి జగన్నాధ్.. ఫొటోలు..

ఒకసారి చిన్న రియలైజ్ అయ్యాను. నేను ఏమన్నా చేసుకుంటే నా ఫ్యామిలీ ఏంటి అనుకున్నాను. ఒకరోజు మా అక్క దగ్గరికి వెళ్లి నాకు బతకాలని ఉంది మొన్న థెరపీ అన్నావుగా ఏంటో చెప్పు అని అడిగితే నన్ను పట్టుకొని ఏడ్చేసింది. అప్పుడు తనే ఓ థెరపిస్ట్ ని తీసుకొచ్చింది. తను నాకు ట్రీట్మెంట్ చేసింది. అప్పుడు అన్ని రియలైజ్ అయ్యాను. అందుకే ఎన్ని బాధలు ఉన్న సంతోషంగా హ్యాపీగా ఉంటాను అందరితో. ఏ రిలేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా థెరపీ తీసుకోండి అని తెలిపారు.