Varun Tej – Lavanya : మెగా ఫ్యామిలీలో సందడి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. తండ్రి అయిన వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట తల్లితండ్రులు అయ్యారు. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. (Varun Tej - Lavanya)

Varun Tej – Lavanya : మెగా ఫ్యామిలీలో సందడి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. తండ్రి అయిన వరుణ్ తేజ్..

Varun Tej Lavanya became Parents

Updated On : September 10, 2025 / 4:05 PM IST

Varun Tej – Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నాళ్ళు ప్రేమించుకొని 2023 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ బ్యూటిఫుల్ కపుల్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం ఈ జంట త్వరలో తాము తల్లి తండ్రులు కాబోతున్నామని, లావణ్య ప్రగ్నెంట్ అని ప్రకటించారు.

తాజాగా లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనించ్చిందని సమాచారం. నేడు లావణ్య డెలివరీ అయిందని, మెగా ఫ్యామిలీ అంతా హాస్పిటల్ కు వెళ్లారని సమాచారం.  చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలోనే గ్యాప్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి వరుణ్ – లావణ్య బిడ్డను చూసొచ్చారు.

Also Read : Bhadrakaali Trailer : ఆకట్టుకుంటున్న విజ‌య్ ఆంటోనీ ‘భ‌ద్రకాళి’ ట్రైల‌ర్‌..

వరుణ్ తేజ్ – లావణ్య జంటకు పండంటి మగబిడ పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. వరుణ్ – లావణ్య తల్లితండ్రులు అవ్వడంతో ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. వరుణ్ లావణ్య తమ బాబుతో ఉన్న ఫోటోని షేర్ చేసిఫు. అలాగే పెదనాన్న చిరంజీవితో ఆనందాన్ని పంచుకుంటున్న ఫోటోని షేర్ చేసారు.

Varun Tej Lavanya