Bhadrakaali Trailer : ఆకట్టుకుంటున్న విజ‌య్ ఆంటోనీ ‘భ‌ద్రకాళి’ ట్రైల‌ర్‌..

విజ‌య్ ఆంటోనీ న‌టిస్తున్న భ‌ద్ర‌కాళి చిత్రం ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌(Bhadrakaali Trailer)ను విడుద‌ల చేశారు.

Bhadrakaali Trailer : ఆకట్టుకుంటున్న విజ‌య్ ఆంటోనీ ‘భ‌ద్రకాళి’ ట్రైల‌ర్‌..

Vijay Antony Bhadrakaali Trailer out now

Updated On : September 10, 2025 / 11:28 AM IST

Bhadrakaali Trailer : విజ‌య్ ఆంటోనీ హీరోగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘శక్తి తిరుమగణ్‌’ (Shakthi Thirumagan). తెలుగులో భ‌ధ్ర‌కాళి పేరుతో విడుద‌ల కానుంది. అరుణ్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ విజ‌య్ ఆంటోనీ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డం విశేషం. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌(Bhadrakaali Trailer)ను విడుద‌ల చేసింది. రాజకీయ నేప‌థ్య క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లుగా ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది.

Akhanda 2 : శివుడిగా బాల‌య్య‌.. విలన్‎గా సంజయ్ దత్!

‘అంద‌రూ ఇలానే త‌ప్పుకుంటే ఎలా ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌టి చేయాలి.. ఆక‌లి ఆక‌లి అంటే ఎవ‌రూ పెట్ట‌రు లాక్కోవాలి.’ అంటూ విజ‌య్ ఆంటోనీ చెప్పిన డైలాగ్‌లు అద‌రిపోయాయి. మొత్తంగా ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నారు.