Akhanda 2 : శివుడిగా బాలయ్య.. విలన్‌గా సంజయ్ దత్!
అఖండ 2(Akhanda 2)కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sanjay Dutt as Villain in Balakrishna Akhanda 2
Akhanda 2 : అఖండ-2 మూవీపై ఓ లెవల్‌లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌పై జోరుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో అఘోర పాత్రలో బాలయ్య అదరగొట్టగా..ఇప్పుడు సీక్వెల్‌లో బాలకృష్ణ పూర్తిగా శివుడి అవతారంలో.. ఉగ్రరూపంలో విలన్స్‌ను అంతం చేసే సీన్ హైలెట్‌గా ఉంటుందట. ఈ సీన్‌ను డైరెక్టర్ బోయపాటి శ్రీను భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారట. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫైట్ సీక్వెన్స్‌కు ఊపు తెచ్చి, థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
బాలయ్య శివతాండవం స్టైల్‌లో ఎంట్రీ ఇస్తూ, త్రిశూలం, ఢమరుకంతో సమరం చేసే సన్నివేశం ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందని చెబుతున్నారు. స్పెషల్ వీఎఫ్‌ఎక్స్ టీమ్‌తో ఈ సీన్ కోసం గ్రాఫిక్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
అఖండ 2 (Akhanda 2) కేవలం యాక్షన్ సినిమాగానే కాకుండా, బలమైన పొలిటికల్ డ్రామాగా కూడా ఆకట్టుకోనుందట. బాలయ్య ఈ మూవీలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించనున్నారట. ఒక పాత్రలో శివభక్తుడిగా, అఘోర లుక్‌లో కనిపిస్తూ, ధర్మం కోసం పోరాడతారని, మరో పాత్రలో పొలిటికల్ లీడర్‌గా జనం సేవలో నిమగ్నమై ఉంటారని టాక్. ఈ రెండు పాత్రలు కథలో ఎలా కనెక్ట్ అవుతాయనేది సినిమాకు ప్రధాన హైలైట్ అని అంటున్నారు.
A Master Piece : త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం..
బోయపాటి ఈ సినిమాను పాన్-ఇండియా రేంజ్‌లో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చేసి, ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ పొలిటికల్ టచ్ సినిమాకు కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. అఖండ-2ను పాన్-ఇండియా స్థాయిలో హైప్ చేయడానికి బోయపాటి టీమ్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకొచ్చారని గాసిప్‌లు షికారు చేస్తున్నాయి.
సంజయ్ దత్ ఒక ఉగ్రవాద నేతగా, పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారట. శివుడి అవతారంలో బాలయ్య..విలన్ రోల్‌లో సంజయ్ దత్‌తో జరిగే క్లైమాక్స్ ఫైట్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. ఈ ఫైట్‌లో బాలయ్య శివతాండవం, సంజయ్ దత్ డెవిలిష్ లుక్‌తో కలిసి సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని లీకులు ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం స్పెషల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ను హైర్ చేసుకున్నారట. సంజయ్ దత్ ఎంట్రీతో అఖండ-2 బాలీవుడ్ మార్కెట్‌లో కూడా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న హోప్స్ ఉన్నాయి.