Chiranjeevi : ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్.. నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ..
తనపై వచ్చే ట్రోల్స్ కి మెగాస్టార్ నేడు సమాధానమిచ్చారు. (Chiranjeevi)
- Saketh U
- Published on- June 13, 2026 / 07:39 PM IST
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ని దాదాపు మూడు దశాబ్దాలు నెంబర్ వన్ గా ఏలిన నటుడు. కమర్షియల్ మాస్ సినిమాలే కాదు తన నటన పర్ఫార్మెన్స్ తో ఏడిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాలకు వెళ్లొచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి చేసే సినిమాలు చూసి ఆయన గురించి తెలియని ఈ జనరేషన్ కొంతమంది చిరుని ట్రోల్ చేసారు.
చిరంజీవి అవే కమర్షియల్ సినిమాలు చేస్తున్నారని, నటనకు స్కోప్ ఎక్కువగా ఉండట్లేదని, ఇది కాదు చిరంజీవి అని, ఒకప్పుడు చిరంజీవి వేరు ఇప్పటి చిరంజీవి వేరు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫ్యాన్స్ కూడా కొంతమంది చిరంజీవిని ఫ్లాప్ అయినా సరే డాడీ, ఆపద్బాంధవుడు, రుద్రవీణ.. లాంటి సినిమాలు చేయాలని రిక్వెస్ట్ లు చేశారు.
ఇలా తనపై వచ్చే ట్రోల్స్ కి మెగాస్టార్ నేడు సమాధానమిచ్చారు. షూటింగ్ లో బిజీగా ఉండి కాస్త ఆలస్యంగా పెద్ది సినిమా చూసిన చిరంజీవి బుచ్చిబాబుని పిలిచి సినిమా గురించి మాట్లాడి అభినందించారు.
ఇందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకసారి నాతో మాట్లాడుతూ.. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేసావు. కానీ ఇప్పుడు కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు. నీలో ఆ పొటెన్షియల్ ఉంది అన్నారు. బాలచందర్ కమల్ – రజిని కలిపితే చిరంజీవి అనే మాటను స్టేజిపై చెప్పారు అని గుర్తుచేశారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను. నాకు ఆ కెపాసిటీ ఉంది. నాకు అలాంటి కథలు వస్తే చేస్తాను అని నమ్మకం కూడా ఉంది. నేను రెడీనే అలాంటి కథలు చేయడానికి. దంగల్, చక్ దే లాంటి సినిమాలు వచ్చినప్పుడు అవి చూసి నాకు కూడా ఇలాంటి కథలు వస్తే బాగుండు అనిపించింది, కానీ అలాంటి కథలు రావట్లేదు అని అన్నారు.
Also Read : Chiranjeevi : కార్పొరేట్ విద్యావ్యవస్థపై చిరంజీవి కామెంట్స్.. ప్రభుత్వాలు సహకరించాలి..
మరి చిరంజీవి ఈ మాట అన్న తర్వాత ఎవరైనా దర్శకులు ఆయన దగ్గరకు ప్రయోగాత్మక సినిమాలు, ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కథలు తీసుకెళ్తారేమో చూడాలి.
