Chiranjeevi : ఎమోషనల్ అయిన మెగాస్టార్.. చరణ్ ని చూసి బాధపడ్డా.. దండం పెట్టి.. పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ..
పెద్ది సినిమా చూసిన చిరంజీవి తాజాగా బుచ్చిబాబుని పిలిచి సినిమా గురించి, చరణ్ గురించి మాట్లాడారు. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా షూట్ లో బిజీగా ఉండి కాస్త ఆలస్యంగా పెద్ది సినిమా చూశారు. స్పోర్ట్స్ కథాంశంతో ఎమోషనల్ గా తెరకెక్కిన పెద్ది సినిమా ఇప్పటికే 370 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పెద్ది సినిమా చూసిన చిరంజీవి తాజాగా బుచ్చిబాబుని పిలిచి సినిమా గురించి, చరణ్ గురించి మాట్లాడారు.
చిరంజీవి పెద్ది గురించి మాట్లాడుతూ.. నేను షూటింగ్ లో బిజీగా ఉండి లేట్ గా చూసాను. ఇది సినిమా కాదు ఒక జీవితంలో డౌన్ ఫాలో లో ఉన్నవాళ్లకు వాళ్ళ జర్నీలా చూపించావు. ఇది చూసాక కోలుకోవడానికి టైం పట్టింది. నిద్రలో కూడా అవే విజువల్స్ వచ్చాయి. అంత డీప్ ఇంపాక్ట్ ఇచ్చావు. ఆ కథ నిజాయితీ, ఇంటెన్సిటీ, దాన్ని చూపించిన విధానం బాగుంది. ఒక ఊరి సమస్య అయినా నేషనల్ లెవల్ లో చూపించావు ఆ కథని. స్పోర్ట్స్ పర్సన్స్ ని గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మంచి పాయింట్ చెప్పావు. మంచి సోషల్ మెసేజ్ ఇచ్చావు. అప్పలసూరి మరణం నుంచి సినిమా హై లెవెల్ కి వెళ్ళింది అని చెప్తూ మూవీకి పనిచేసిన అందర్నీ పేర్లు చెప్తూ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడుతూ అభినందించారు.
Also Read : Chiranjeevi : కార్పొరేట్ విద్యావ్యవస్థపై చిరంజీవి కామెంట్స్.. ప్రభుత్వాలు సహకరించాలి..
ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టాడని తెలిసిందే. ప్రేక్షకులను చరణ్ తన నటనతో ఏడిపించాడు. పెద్దిలో చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా చూసి చరణ్ బాగా నటించాడని వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అనేది కరెక్ట్ కాదు జీవించాడు అనాలి అని చెప్పాను. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్టర్ గా నాకు తెలుసు అవతలి నటుడు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలికిస్తూ ప్రేక్షకులను ఏడిపిస్తే జీవించేసాడు అనాలి. చరణ్ అలా జీవించేసాడు. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్తాను. తండ్రి గా, నటుడిగా చరణ్ ని చూసి గర్వపడుతున్నాను. కొడుకుని కన్నప్పుడు కాదు అతను ఎదిగి అందరూ పొగిడినప్పుడు పుత్రోత్సాహం అంటారు. ఇప్పుడు అది తెలిసి వచ్చింది.
చరణ్ రోజూ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి నేను ఇంట్లో చూసా. రోజు వెజిటేరియన్ గానే ఉంటూ జిమ్ చేసాడు. అతని కష్టం చూసి ఇంత అవసరమా అనుకున్నా. నేను కూడా కష్టపడ్డా కానీ మరీ ఇంత చేయలేదు. వాళ్ళ అమ్మ అయితే ఏం అవ్వకూడదు అని దండం పెట్టుకుంది. చరణ్ అలిసిపోయి ఇంటికొచ్చిన ప్రతిసారి మా నాన్న ఎందుకంత కష్టం అంటూ నాతో మాట్లాడింది గుర్తొచ్చింది. నా కష్టం చూసి మా నాన్న తిట్టారు. ఇప్పుడు నాకు అలానే అనిపించింది. నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయి ఇలా కష్టపడితే నీకు తెలుస్తుంది అనేవాళ్ళు నాన్న. చరణ్ కంటికి గాయం అయినపుడు, మణికట్టుకి గాయం అయినప్పుడు చాలా బాధ వేసింది. అప్పుడు నా కష్టం చూసి మా నాన్న ఎంత బాధపడ్డారో అనిపించింది. నేను ఒప్పుకుంటున్నా చరణ్ చిరంజీవిని మించినవాడు. ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తామా ఏంటి అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Chiranjeevi : ‘పెద్ది’ సక్సెస్ స్పెషల్.. బుచ్చిబాబుతో చిరంజీవి ఇంటర్వ్యూ..
