Unstoppable with NBK: బాలయ్య టాక్ షోలో చిరు.. ఎలాఉంటుందో ఫ్యాన్స్ ఊహకే!
టాలీవుడ్ నట సింహం ఇప్పుడు తనలోని మరోవైపు చూపించేందుకు సిద్దమయ్యాడు. ముందెన్నడూలేని విధంగా డిజిటల్ వైపు చూస్తున్న బాలయ్య ఇప్పటికే రాబోయే తన టాక్ షో మీద అంచనాలను భారీగా పెంచేశాడు.
- Naresh Mannam
- Published On : October 29, 2021 / 09:20 PM IST
Unstoppable With Nbk
Unstoppable with NBK: టాలీవుడ్ నట సింహం ఇప్పుడు తనలోని మరోవైపు చూపించేందుకు సిద్దమయ్యాడు. ముందెన్నడూలేని విధంగా డిజిటల్ వైపు చూస్తున్న బాలయ్య ఇప్పటికే రాబోయే తన టాక్ షో మీద అంచనాలను భారీగా పెంచేశాడు. అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో కొద్ది రోజుల్లోనే బాలయ్య తనలోని మరో కోణాన్ని బయటపెట్టనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్స్ షో ఎలా ఉండనుండో చెప్పకనే చెప్పేశాయి.
Pushpa: రంగస్థలాన్ని మర్చిపోని సుక్కూ.. పుష్పలో అదే ఫార్ములా!
బాలయ్య టాక్ షో అంటే మాటలు కాదు కదా.. అందుకే ఆయన స్థాయికి తగ్గట్లే ఈ షోను ప్లాన్ చేసిన నిర్వాహకులు.. ఇందులో పాల్గొనే వారిని అదే స్టార్ రేంజ్ ఉన్నవారితో మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని ఈ టాక్ షోలో పాల్గొనేలా ప్రయత్నాలు మొదలైనట్లుగా తెలుస్తుంది. నిజానికి తొలి ఎపిసోడ్ ను చిరంజీవితోనే మొదలు పెట్టనున్నారని ప్రచారం జరిగింది. కానీ.. ఏమైందో ఏమో కానీ.. అన్ స్టాపబుల్ టాక్ షో తొలి ఎపిసోడ్ కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చీఫ్ గెస్ట్ అయ్యారు. ఇప్పటికే దీని షూటింగ్ కూడా పూర్తయింది.
Pranitha Subhash: కుర్రకారు మెచ్చిన బాపుబొమ్మ ప్రణీత!
అయితే, త్వరలోనే మెగాస్టార్ కూడా ఈ షోకు అతిధిగా రానున్నాడని తెలుస్తుంది. ఆహా ఓటీటీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంపౌండ్ కు చెందినదే కాగా.. బాలయ్యతో షో ప్లాన్ చేసింది కూడా అరవిందే. సో.. చిరంజీవి ఈ షోలో మెరవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.. కాకపోతే సమయం కలిసి రావాలి. అదే జరిగితే అటు నందమూరి.. ఇటు మెగా అభిమానులకు ఇది పండగే అవుతుంది. ఇప్పటికే ఈ రెండు కుటుంబాల నుండి స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ ఒకవైపు విడుదలకు సిద్ధమైతే.. ఇటు బాలయ్య-చిరు ఎపిసోడ్ బయటకొస్తే ఇక అభిమానులకు అది పూనకాలేనని చెప్పుకోవాలి.
