×
Ad

Chiranjeevi : పవర్ ఫుల్ పోలీస్ పాత్రని రిజెక్ట్ చేసిన మెగాస్టార్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్..

తాజాగా చిరంజీవి ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రని వదులుకున్నారని దర్శకుడు గుణశేఖర్ కామెంట్స్ చేసారు.(Chiranjeevi)

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఈ సినిమా మెగాస్టార్ కి, మెగా ఫ్యాన్స్ కి పూర్తి ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ బాబీతో చేయడానికి రెడీ అయిపోయారు. ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన పాత్ర పలు కారణాలతో ఇంకొకరు చేయడం మాములే. తాజాగా చిరంజీవి ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రని వదులుకున్నారని దర్శకుడు గుణశేఖర్ కామెంట్స్ చేసారు.(Chiranjeevi)

ఒకప్పుడు సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ చూస్తున్నారు. ఇటీవలే యుఫొరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి మెసేజ్ ఇచ్చినా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఈ సినిమాలో భూమిక, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు చేసారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు. అయితే ఈ పాత్ర చిరంజీవి చేయాలంట.

Also Read : Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లితో పాటు రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?

డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట చిరంజీవి గారిని గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు అనుకున్నాను. ఆయన కోసం మూడు నెలలు ఎదురుచూశాను కూడా. ఆయనకు కథ మొత్తం నేరేట్ చేశాను. మూడు గంటలు మొత్తం విన్నారు. విని చాలా బాగుంది, పవర్ ఫుల్ రోల్ అన్నారు. ఆయనకు కూడా చేయాలనిపించింది.

కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కీ రోల్స్, స్పెషల్ రోల్స్ చేయలేను అని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత చూస్తాను ఇలాంటివి అన్నారు. కానీ నేను రెండు నెలలు ఆయన మనసు మారుతుందేమోనని ఎదురుచూశాను అని తెలిపారు.

Also Read : Swayambhu : నిఖిల్ స్వయంభు టీజర్ చూశారా..? బాహుబలి, మగధీర లెవల్లో..