Mega 154 : మెగా ఫ్యాన్స్.. పూనకాలు లోడింగ్..
లుంగీ కట్టి, స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న మెగాస్టార్ మాస్ లుక్ చూస్తే.. ‘ముఠామేస్త్రి’ మూవీ గుర్తొస్తుంది..
- sekhar
- Published on- August 22, 2021 / 04:29 PM IST
Chiru 154
Mega 154: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల అప్డేట్స్తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసీఫర్’ రీమేక్‌కి ‘గాడ్ ఫాదర్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!
‘ఆచార్య’ మేకింగ్ వీడియోతో తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెహర్ రమేష్ డైరెక్షన్లో చేస్తున్న ‘వేదాళం’ రీమేక్ మూవీకి ‘భోళా శంకర్’ పేరు పెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తున్నట్లు తెలియజేస్తూ రాఖీ సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశారు.
Bholaa Shankar : ‘మెగాస్టార్’ చెల్లెలిగా ‘మహానటి’..
ఇప్పుడు మరో మెగా అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ – యంగ్ డైరెక్టర్ బాబీ కలయికలో.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చిరు 154వ సినిమాను నిర్మిస్తోంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. లుంగీ కట్టి, స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న మెగాస్టార్ మాస్ లుక్ చూస్తే.. ‘ముఠామేస్త్రి’ మూవీ గుర్తొస్తుంది.
Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..
‘పూనకాలు లోడింగ్’ అంటూ.. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందని తెలిపారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ క్రేజీ ఫిలింకి ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం.
