×
Ad

Chiranjeevi: కొడుకు డాన్స్ చూసి మురిసిపోతున్న చిరు.. రయ్ రయ్ రారా సాంగ్ పై మెగా ప్రశంసలు

పెద్ది సినిమాలో రయ్ రయ్ రారా సాంగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).

Chiranjeevi praises ram charan dance in Rai Rai Rara song

  • పెద్ది నుంచి రయ్ రయ్ రారా సాంగ్ రిలీజ్
  • డాన్స్ తో అదరగొట్టిన రామ్ చరణ్
  • కొడుకు డాన్స్ పై చిరు ఆసక్తికర కామెంట్స్

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

దానికి కారణం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవడం. ఈ సినిమా ప్లాప్ తో రామ్ చరణ్ రేస్ లో కాస్త వెనుకబడ్డాడు. అందుకే, పెద్ది సినిమాతో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పెద్ది సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లోనే ఉంది. టీజర్ కానీ, చికిరి సింగ్ కానీ సోషల్ మీడియాను షేక్ చేశాయి.

Ashwath Marimuthu: రెండో ఛాన్స్ కాన్సెప్ట్ తో రెండు సినిమాలు.. డైరెక్టర్ కు యూత్ లో ఫుల్ క్రేజ్.. కొత్త సినిమా ఎవరితోనో తెలుసా?

ఇక తాజాగా, పెద్ది సినిమా నుంచి రయ్ రయ్ రారా అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. హీరో పరిచయ గీతంగా వస్తున్న ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బీట్, దానికి అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ నెక్స్ట్ లెవల్లో సెట్ అయ్యాయి. ఇక ఆ పాటలో రామ్ చరణ్ చేసిన డాన్స్ కి సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అదిరిపోయే మూమెంట్స్ రామ్ చరణ్ వేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం డాన్స్ చేయడమే కాదు తండ్రిలాగా గ్రేసును కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు చరణ్. అందుకే, ఆడియన్స్ నుంచి ఈ సాంగ్ పై ప్రశంసలు దక్కుతున్నాయి. తాజా రయ్ రయ్ రారా సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా స్పదించాడు. ఈమేరకు నెట్టింట పోస్ట్ పెట్టాడు.. ‘రయ్ రయ్ రారా సాంగ్ లో ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ అద్భుతంగా కలిసిపోయాయి. సూపర్ స్పీడ్‌లోనూ అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులు వేస్తున్న చరణ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంద’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో రయ్ రయ్ రారా సాంగ్ పై మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.