Chiranjeevi : చరణ్ కెరీర్‌లో ఎదుగుదల.. వరుణ్ ఎంగేజ్మెంట్.. పాప జాతకం వల్లే.. మీడియాతో చిరంజీవి!
మెగా వారసురాలిని చూసుకున్న మెగాస్టార్ ఆ సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చరణ్ కెరీర్‌లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్మెంట్ పాప జాతకం వల్లే..
- gum 95921
- Updated on- June 30, 2023 / 04:19 PM IST
Chiranjeevi shares his happiness about his grand daughter birth
Chiranjeevi – Ram Charan : మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన (Upasana) నేడు పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. ఈ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఎన్నో ఏళ్లగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం నిజం అవ్వడంతో టాలీవుడ్ లో మెగా సంబరాలు మొదలయ్యాయి. ఇక ఈ మెగా ప్రిన్స్ ని చూసేందుకు మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. మెగా వారసురాలిని చూసుకున్న మెగాస్టార్ ఆ సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Chiranjeevi : మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి.. మెగాస్టార్ ఏమి చెప్పారు..
“ఈరోజు జూన్ 20 ఉదయం 1:49 కి రామ్ చరణ్, ఉపాసన పాప జన్మనించారు. వాళ్లిద్దరూ ఒక బిడ్డని మా చేతిలో పెడతారని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. దీంతో మా కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందంటున్నారు. గత కొంత కాలంగా మా ఇంటిలో అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నాయి. చరణ్ కెరీర్‌లో ఎదుగుదల మరియు ఘనతలు, ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్.. పాప జాతకం వల్లే అని నేను నమ్ముతున్నాను” చిరంజీవి చెప్పుకొచ్చాడు.
ఇక ఇతర రాష్ట్రాలు మరియు దేశాల్లో ఉన్న మా శ్రేయోభిలాషులు, అభిమానులు మా ఈ ఆనందాన్ని పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అలాగే మెగా ఫ్యామిలీ నమ్ముకున్న ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతివంతమైన రోజు మంగళవారం నాడే పాప జన్మించడం మరింత ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. కాగా
అపోలో హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు భారీగా చేరుకొని సందడి చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులు రామ్ చరణ్ అండ్ ఉపాసనకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
