మెగాస్టార్ తీసిన మొదటి ఫొటో.. వీళ్లల్లో ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?..

  • Publish Date - August 19, 2020 / 06:58 PM IST

Chiranjeevi shares the first photo: నేడు(ఆగస్టు 19) వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇది ఆయన తీసిన మొదటి ఫొటో. ఈ ఫొటోను స్వయంగా చిరునే తీశారు. అంతేకాదు, ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను తీసిన మొదటి ఫొటో మరికాసేపట్లో.. అంటూ కొంతసేపు సస్పెన్స్ తర్వాత చిరు సదరు ఫొటోను షేర్ చేశారు.

చిరంజీవి తీసిన ఈ మొదటి ఫొటోలో ఐదుగురు చిన్న కుర్రాళ్లు ఉన్నారు. అయితే, ‘‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని చిరంజీవి ఛాలెంజ్ విసిరారు. ఆయన ప్రశ్నకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అందరికీ బాగా తెలిసిన ఆ వ్యక్తిని అందరూ గుర్తుపడుతున్నారు. ఆయన ఎవరో కాదు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. సరిగ్గా మధ్యలో నిలబడి కుర్రాడు. పవన్ కళ్యాణ్‌ చిన్నతనంలోనూ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బహుశా ఈ ఫొటోను చిరంజీవి మొగల్తూరులో తీసి ఉండొచ్చు. అది కూడా ఇంటి మేడ మీద. ఎందుకంటే, ఫొటోలో వెనుక పెంకుటిల్లులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వరల్డ్ ఫొటోగ్రఫీ డే రోజున తాను తీసిన తొలి ఫొటోను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో కూడా చూపించారు చిరు. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇవ్వాళ #WorldPhotographyDay నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి #agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో…. … pic.twitter.com/YnVdZPOgys

— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020