Varun Tej : వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..? చైల్డ్ ఆర్టిస్టుగా..

వరుణ్ మొదటి మూవీ అంటే.. 'ముకుంద' అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు.

Chiranjeevi shares Varun Tej first screen appearance movie fact to audience

Varun Tej : టాలీవుడ్ ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా మార్చి 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (ఫిబ్రవరి 25) చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చాలా తెలియని విషయాలను చిరు అండ్ వరుణ్ అభిమానులతో పంచుకున్నారు. ఈక్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన మొదటి మూవీ గురించి కూడా అందరికి తెలియజేసారు.

వరుణ్ మొదటి మూవీ అంటే.. ‘ముకుంద’ అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించారు. ఆ గెస్ట్ అపిరెన్స్ లో చిరంజీవితో పటు వరుణ్ తేజ్ కూడా కనిపిస్తారు. ఆ సమయానికి వరుణ్ వయసు పదేళ్లు.

Also read : Prabhas : లండన్‌లో ప్రభాస్ ఇల్లు తీసుకున్నారా? వామ్మో.. మరీ అంత రెంటా?

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. ‘హేండ్సప్’ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. శివ నాగేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హీరోయిన్ జయసుధ కథని అందించడం విశేషం. స్టోరీ ఇవ్వడంతో పాటు మూవీలో ముఖ్య పాత్రని పోషించారు. ఇక ఈ సినిమాలోని ఓ ఫైట్ సన్నివేశంలో సోనూసూద్ ని చిరంజీవి కొట్టిపడేస్తారు. ఆ సీన్ లోనే వరుణ్ తేజ్ అలా ఒక రెండు డైలాగ్స్ తో కనిపించి వెళ్ళిపోతారు. ఆ సీన్ యూట్యూబ్ లో ఉంటుంది చూసేయండి.

ఇక ఆపరేషన్ వాలెంటైన్ విషయానికి వస్తే.. తెలుగు, హిందీ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మానుషీ చిల్లర్, రుహాణి శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం.. తెలుగు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా రాబోతుంది. పుల్వామా ఎటాక్ నేపథ్యంతో రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమాని రూపొందించారు. ట్రైలర్ అండ్ టీజర్ తో మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ చేసారు.

ట్రెండింగ్ వార్తలు