Chiranjeevi : మరోసారి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకున్న మెగాస్టార్.. తెల్లారే సమస్య పరిష్కరించి.. వాళ్ళిద్దరితో మెగా మీటింగ్..

ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనేదానిపై కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేసారు.(Chiranjeevi)

  • Published on- July 13, 2026 / 08:41 PM IST

Chiranjeevi

Chiranjeevi : దాసరి నారాయణరావు మరణించిన తర్వాత నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అని చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవిని కొంతమంది ఇండస్ట్రీ పెద్ద అని సంబోధించారు. అందుకు తగ్గట్టు చిరంజీవి కూడా కొన్ని సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సహాయాలు చేస్తూ వచ్చారు. కానీ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనేదానిపై కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేసారు.

దీంతో మెగాస్టార్ తనంతట తానే ఇండస్ట్రీ పెద్ద అనే పేరు వద్దు కానీ ఏదైనా సమస్య వస్తే నిలబడతాను అని మీడియా ముందే చెప్పారు. ఇటీవల డిస్ట్రిబ్యూటర్స్ పర్శంటేజ్ ఇష్యూ అయినప్పుడు నెలల తరబడి సాగినా చిరంజీవి పిలిచి మాట్లాడటంతో సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వకపోయినా అప్పటివరకు కొంత సద్దుమణిగింది. దీంతో చిరంజీవి పెద్దరికం గురించి మరోసారి చర్చ జరిగింది.

Also See : Brigida Saga Engagement : సైలెంట్ గా బాయ్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకున్న నటి.. బ్రిగిడా సాగా-అనంత్ రామ్ ఫొటోలు వైరల్..

తాజాగా మెగాస్టార్ పెద్దరికం గురించి అంతా మాట్లాడుతున్నారు. నిన్న డ్యాన్సర్స్ అసోసియేషన్ లో గొడవలు రావడం, టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ ఒకర్నొకరు తిట్టుకున్నారని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సమస్యతో చిరుకు సంబంధం లేదు. కానీ ఇండస్ట్రీ సమస్య, ఇద్దరు పెద్ద కొరియోగ్రాఫర్స్ కావడంతో చిరంజీవికి ఈ విషయం తెలిసి తెల్లారే ఇద్దర్ని పిలిచారు.

నేడు మెగాస్టార్ 158 షూటింగ్ సెట్ కి లంచ్ బ్రేక్ లో ఇద్దర్ని పిలిచి ఇద్దరికీ లంచ్ పెట్టి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చూసి ఇద్దర్ని కూల్ చేసినట్టు తెలుస్తుంది. సున్నితంగా స్టార్ హీరో చెప్పే విధంగా చెప్పి ఇద్దరితో మాట్లాడారు చిరు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ చిరంజీవి పాటలతో, ఆయన సపోర్ట్ తో ఫేమ్ తెచ్చుకున్నవాళ్ళే. అలాంటిది చిరునే స్వయంగా పిలిచి మాట్లాడితే తగ్గరా. అందుకే నేడు జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి శేఖర్ అన్న అంటూ మాట్లాడారు. చిరంజీవి పిలిచి భోజనం పెట్టి మాట్లాడారని, మా మధ్య విబేధాలు లేవని మీడియా ముందు చెప్పారు.

Also Read : Adhey Neevu Adhey Nenu : ‘అదే నీవు అదే నేను’ సినిమా నుంచి ‘తుళ్లిపడకే మనసా..’ లవ్ సాంగ్ విన్నారా..?

చిరంజీవి బిజీగా ఉన్నా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ వీడియో వైరల్ అవడంతో టైం తీసుకొని పిలిచి మాట్లాడటంతో మరోసారి చిరంజీవి పెద్దరికాన్ని టాలీవుడ్ ప్రముఖులు అభినందిస్తున్నారు. సమస్య తన దగ్గరకు రాకపోయినా తెలుసుకొని పరిష్కరించారు అంటే ఇంతకంటే పెద్దరికం ఏముంటుందని అంటున్నారు.