పూర్తిగా కోలుకున్న Sai Dharam Tej… ఫ్యాన్స్‌కు చిరంజీవి గుడ్‌న్యూస్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. గత సెప్టెంబర్ 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు తొలిసారిగా దర్శనమిచ్చారు.
- Naveen
- Published On : November 5, 2021 / 11:51 PM IST
Sai Dharam Tej
Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. గత సెప్టెంబర్ 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు తొలిసారిగా దర్శనమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సాయి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సెప్టెంబర్ 10న మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యారు తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సాయి ధరమ్ తేజ్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేజ్.. ఇంటికే పరిమితం అయ్యారు.
Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!
తాజాగా తేజ్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి పూర్తి క్లారిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ కెమెరా ముందుకు వచ్చారు. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని, మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని అన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో చిరంజీవి… తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యేసి ఉండగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ ఉన్నారు.
దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించారు. తనకు ఇది పునర్జన్మ వంటిదని అన్నారు. నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అంటూ భావోద్వేగంతో పోస్టు చేశారు. మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!
యాక్సిడెంట్ తర్వాత అసలు ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. ఎలాంటి ఫొటో కూడా విడుదల చేయలేదు. తొలిసారి ఫ్యామిలీ ఫంక్షన్‌లో అందరి హీరోలను కలుసుకున్నారు. దీంతో సాయిధరమ్ తేజ్ హెల్త్ గురించి ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్ కు రిలీఫ్ దక్కినట్లు అయ్యింది.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.?? https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021
