H Vinoth : ఏడ్చేసిన జన నాయగన్ డైరెక్టర్.. సీఎం విజయ్ కాల్ చేసి..
ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(H Vinoth)
H Vinoth
H Vinoth : విజయ్ జన నాయగన్ సినిమా అనేక మార్లు వాయిదా పడి, సెన్సార్ సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. జులై 23న జన నాయగన్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విజయ్ సీఎం అయ్యాక రిలీజ్ అవుతుండటం, ఇదే విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ లేకపోయినా మూవీ యూనిట్ మాత్రం ఎంతో కొంత ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో జన నాయగన్ డైరెక్టర్ H వినోద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Balakrishna : బాబాయ్ కోసం ఇద్దరు అబ్బాయిలు.. త్వరగా కోలుకోవాలి బాల బాబాయ్ అంటూ.. ట్వీట్స్ వైరల్..
వినోద్ మాట్లాడుతూ.. జన నాయగన్ సినిమా విషయంలో నేను రెండు సార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ కి సినిమా రిలీజ్ అవ్వనప్పుడు, సినిమా మొత్తం ఆన్లైన్ లో లీక్ అయి పైరసీ అయినప్పుడు ఏడ్చాను. ఆ పైరసీ ఆపడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు అందుకు బాధపడ్డాను. అప్పుడు నాకు విజయ్ సర్ అండగా నిలబడ్డారు. విజయ్ సర్ నాకు ఫోన్ చేసి.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బాధపడకండి. మీ మనసు బాగోకపోతే నాకు కాల్ చేయండి అని ధైర్యం ఇచ్చినట్టు తెలిపారు.
అలాగే జన నాయగన్ సినిమా భగవంత్ కేసరి రీమేకే కానీ కొంత కథ మార్చుకున్నాం. 50 శాతం మాత్రం భగవంత్ కేసరి కథ తీసుకున్నాం అని తెలిపారు. దీంతో వినోద్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
