Chiranjeevi : తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేడు సీఎంతో పాటు పలు ముఖ్య పదవులకు సంబంధించిన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోగవర్నర్ తమిళిసై సమక్షంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కొత్త ప్రభుత్వంలోని మెంబెర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నాయకత్వంలో రాష్ట్రం అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : Animal Collections : ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ని దాటేసిన యానిమల్ కలెక్షన్స్..
Hearty Congratulations to
Sri @revanth_anumula garu on being sworn in as the new Chief Minister of Telangana. 💐 May our state achieve greater growth and prosper further under your leadership!Hearty Congratulations to Dy. CM
Sri @BhattiCLP garu & all the members of the new…— Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2023
ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే.. బింబిసారా దర్శకుడు వశిష్ఠతో 156 సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఒక పేపర్ నెట్టింట లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కథ పంచభూతాలు చుట్టూ తిరగనుందట. ఈ మూవీకి చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నారట.