Animal Collections : ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ని దాటేసిన యానిమల్ కలెక్షన్స్..

ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ని దాటేసిన యానిమల్ మూవీ కలెక్షన్స్. ఇదే స్పీడ్ కొనసాగితే..

Animal Collections : ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ని దాటేసిన యానిమల్ కలెక్షన్స్..

Ranbir Kapoor Animal movie Collections cross 500 crore mark

Updated On : December 7, 2023 / 1:38 PM IST

Animal Collections : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. నాన్న ఎమోషన్ తో రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఇక సెకండ్ అండ్ థర్డ్ డేస్ లో ఫస్ట్ డేని మించి 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న ఈ మూవీ.. నాలుగు, ఐదు రోజుల్లో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఆరు రోజు 46 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 527.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 250 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 600 కోట్లకు పైగా రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాదించేస్తుందని తెలుస్తుంది.

Also read : Abhiram Daggubati : లంకలో దగ్గుబాటి రాముడికళ్యాణం.. పెళ్లి ఫోటో వైరల్

ఇదే స్పీడ్ కొనసాగితే ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమా రిలీజ్ లు ఏం లేవు. ఇటు సౌత్ లో కూడా మాస్ మసాలా చిత్రాలేవీ లేవు. మరి యానిమల్ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ పంజా వేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో లైంగిక, గృహ హింస ఎక్కువగా ఉందని పలువురు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.