Abhiram Daggubati : లంకలో దగ్గుబాటి రాముడి కళ్యాణం.. పెళ్లి ఫోటో వైరల్

దగ్గుబాటి వారింట పెళ్లి బాజా మోగింది. దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కుమారుడు దగ్గుబాటి అభిరామ్ దగ్గర బంధువైన ప్రత్యూషను పెళ్లాడారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Abhiram Daggubati : లంకలో దగ్గుబాటి రాముడి కళ్యాణం.. పెళ్లి ఫోటో వైరల్

Abhiram Daggubati

Updated On : December 7, 2023 / 1:40 PM IST

Abhiram Daggubati : దగ్గుపాటి వారింట పెళ్లి బాజా మోగింది. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. దగ్గరి బంధువైన ప్రత్యూషతో ఏడడుగులు నడిచారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Polimera 2 : ఓటీటీకి వచ్చేసిన పొలిమేర 2.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల వివాహం శ్రీలంకలో గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు దగ్గుబాటి కుటుంబం తరలి వెళ్లింది. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మధ్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువని ఆమె స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది.

Tollywood Actress : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? వైరల్ అవుతున్న ఫోటోలు..

దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ ఇటీవలే  హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి రానా రజనీకాంత్ సినిమా ‘తలైవర్ 170’ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రాజెక్టు ‘హిరణ్యకశ్యప’ తో కూడా బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by South Celebrity (@southcelebrity.insta)