Chiranjeevi : హనుమాన్ దర్శకుడితో చిరంజీవి సినిమా.. ‘సైరా’ ముందే రావాల్సింది.. కానీ..

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'కి ముందే ఓ సినిమా చేయాల్సిందట. కానీ ఏమైందంటే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయాల్సిందట. అది కూడా ఇప్పుడు కాదు ‘సైరా నరసింహారెడ్డి’కి ముందట. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో ‘హనుమాన్’.. ప్రస్తుతం థియేటర్స్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవికి తనవంతు సహకారం అందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చి సినిమా రిలీజ్ కి మరింత క్రేజ్ ని తీసుకు వచ్చారు.

అంతేకాదు ఈ సినిమాలో గ్రాఫిక్స్ లో సృష్టించిన హనుమాన్ కి చిరంజీవి కళ్ళని ఉపయోగించుకున్నారు.. అనే విషయాన్ని కూడా మూవీ టీం బాగా వాడుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత కూడా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చిరంజీవి మాట్లాడిన మాటలను మళ్ళీ రీ షేర్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇక హనుమాన్ సినిమాతో పాటు ఇవన్నీ చూసిన మెగా ఫ్యాన్స్.. చిరుతో ఓ సినిమా చేయమని ప్రశాంత్ వర్మని కోరుతున్నారు.

Also read : Mahesh Babu : ‘గుంటూరు కారం’ నా లాస్ట్ తెలుగు సినిమా కావొచ్చు.. మహేష్ షాకింగ్ కామెంట్స్..

ఈ విషయం పై ప్రశాంత్ వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. తన మొదటి సినిమా మొదలు పెట్టకముందే.. ప్రశాంత్ వర్మ, చిరంజీవికి ఓ కథ వినిపించారట. చిరంజీవిని ఓ సందర్భంలో కలుసుకున్న ప్రశాంత్ వర్మ.. ఏదో సరదాకి ఓ సినిమా స్టోరీ చెప్పారట. అది చిరుకి బాగా నచ్చేసిందట. ఆ తరువాత మళ్ళీ చిరుని ఒకసారి కలుసుకొని ఈసారి పూర్తి నరేషన్ ఇచ్చారట. ఆ కథలో చిరు కొన్ని చేంజెస్ చెప్పారట.

ఆ చేంజస్ ని కూడా ప్రశాంత్ వర్మ చేసుకొని వచ్చి చిరుకి మళ్ళీ వినిపించగా.. మొత్తానికి చిరంజీవి కూడా ఓకే చెప్పేశారట. అయితే ఈ మూవీ సమయంలో చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఓకే అయ్యినప్పుడే సైరా పట్టాలు ఎక్కిందట. దీంతో చిరు ఆ సినిమాలో బిజీ అవ్వడంతో.. ప్రశాంత్ వర్మ ‘ఆ’ సినిమా చేశారు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అయ్యారు. మరి ఇప్పుడు చిరు ఏమన్నా అవకాశం ఇస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు