Chiranjeevi : వీరసింహారెడ్డి కోసం నన్ను డేట్ మార్చుకోమంటే.. నేను మార్చుకునేవాడిని.. చిరంజీవి!

నందమూరి నటసింహ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండడంతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్ల వద్ద ఒక రోజు గ్యాప్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలని ఒకే ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుండడం విశేషం. తాజాగా దీనిపై చిరంజీవి స్పందించాడు.

chiru say he would change his waltair veerayya date for Veerasimha Reddy

Chiranjeevi : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ కనిపిస్తుంది. నందమూరి నటసింహ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండడంతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్ల వద్ద ఒక రోజు గ్యాప్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలని ఒకే ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుండడం విశేషం. తాజాగా దీనిపై చిరంజీవి స్పందించాడు.

Chiranjeevi : విశాఖలో ఇల్లు కడుతున్నా.. ఇక్కడే సెటిల్ అవుతా అంటున్న మెగాస్టార్.. ఏపీలో చర్చగా మారిన వ్యాఖ్యలు..

ఇటీవల ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. “పెరిగిన రేట్ల బట్టి ఆడియన్స్ నెలలో ఒక సినిమా మాత్రమే చూద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు స్టార్ హీరోలు అంతా ఒకే సీజన్ లో వచ్చేస్తే, మహా అయితే రెండు సినిమాలు చూస్తారేమో. మిగతావి టీవీలో చూద్దాం అనుకుంటారు. అసలు సీజన్ లో వస్తేనే స్టార్ హీరో సినిమాకి కలెక్షన్స్ వస్తాయి అంటే, అతను స్టార్ హీరో ఎలా అవుతాడు. మంచి కంటెంట్ ఉంటే నార్మల్ డేస్ అయినా సినిమా విజయాన్ని అందుకుంటుంది.

ఉదాహరణకి మైత్రి మూవీ మేకర్స్ వారి ‘ఉప్పెన’ సినిమా ఉంది. సినిమాలకు ఫిబ్రవరి నెల అసలు మంచిది కాదు అంటారు. కానీ ఆ చిత్రం ఆ నెలలోనే రిలీజ్ అయ్యి దాదాపు.100 కోట్లు కొల్లగొట్టుంది. మరీ ఎగ్జామ్స్ సమయంలో కాకుండా ఎప్పుడు రిలీజ్ చేసిన ప్రేక్షకులు సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు. నా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయంలో నిర్మాతలు.. వీరసింహారెడ్డి రిలీజ్ చేసుకోవాలి నన్ను ఫిబ్రవరికి మార్చుకోమంటే, నేను మార్చుకునేవాడిని. కానీ వాళ్ళు నన్ను అడగ లేదు. మంచి కంటెంట్ ఉంటే డేట్ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు” అంటూ వెల్లడించాడు. కాగా నేడు థియేటర్ల వద్ద వీరసింహారెడ్డి జాతర మొదలైంది. రేపు వాల్తేరు వీరయ్య పూనకాలు లోడ్ అవుతున్నాయి.