Chiyaan 62 : చియాన్ విక్రమ్ 62 అనౌన్స్‌మెంట్.. వీడియో అదిరిపోయింది
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ, విభిన్న పాత్రలను చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు.
- Thota Vamshi Kumar
- Published On : October 28, 2023 / 09:54 PM IST
Chiyaan 62 Announcement
Chiyaan 62 Announcement : జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ, విభిన్న పాత్రలను చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలోనే కాదు తెలుగులోనూ విక్రమ్‌కు ఫాలోయింగ్ ఉంది. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.
ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కెరీర్‌లో ఇది 62వ సినిమా. చియాన్ 62 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను శనివారం వీడియో రూపంలో మేకర్స్ తెలియజేశారు. ఈ వీడియోలో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి మరీ విక్రమ్.. ఇద్దరు వ్యక్తులను కొడుతూ కనిపించారు. అనంతరం తాను ఎవరు అన్న సంగతిని అక్కడే ఉన్న కానిస్టేబుల్ చెవిలో చెప్పి విక్రమ్ వెళ్లిపోయాడు.
Suresh Gopi : జర్నలిస్ట్‌తో ప్రముఖ నటుడి అసభ్య ప్రవర్తన.. ఆపై..
ఆఖర్లో సరుకులు మోసుకుంటూ బైక్ పై విక్రమ్ వెళ్లడం కనిపించింది. మొత్తంగా వీడియో అదిరిపోయింది అని చెప్పాలి. బలమైన కథాంశంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. జీవి ప్రకాశ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. పా.రంజిత్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ తంగలాన్ సినిమాలో నటిస్తున్నారు. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన ఒక కథని తీసుకోని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీలోని విక్రమ్ లుక్స్ చూసి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇది విక్రమ్ కెరీర్‌లో 61వ సినిమా. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
