Dethadi Harika : హీరోయిన్‌గా యూట్యూబర్ దేత్తడి పిల్ల అలేఖ్య హారిక.. ‘బేబీ’ డైరెక్టర్ నిర్మాణంలో.. హీరో ఎవరో తెలుసా?

యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Dethadi Harika : హీరోయిన్‌గా యూట్యూబర్ దేత్తడి పిల్ల అలేఖ్య హారిక.. ‘బేబీ’ డైరెక్టర్ నిర్మాణంలో.. హీరో ఎవరో తెలుసా?

Dethadi Fame Alekhya Harika entry as Heroine in Soon with Baby Movie Director Production

Updated On : October 28, 2023 / 4:31 PM IST

Dethadi Harika : యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత ఫేమస్ అయింది ఈ తెలంగాణ అమ్మడు. ప్రస్తుతం యూట్యూబ్ లోనే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

Also Read : Khaidi : చిరంజీవిని స్టార్ హీరోగా చేసిన ‘ఖైదీ’.. నేటికి నలభై ఏళ్ళు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్

అలేఖ్య హారిక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా కొత్త సినిమా మొదలవ్వనుంది. ఈ సినిమాని బేబీ నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి నిర్మించనున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే షూట్ మొదలవ్వనుందని సమాచారం.

Dethadi Fame Alekhya Harika entry as Heroine in Soon with Baby Movie Director Production