Dhruva Natchathiram : రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..

2013లో మొదలైన గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది.

Chiyaan Vikram Dhruva Natchathiram Chapter One postponed again

Dhruva Natchathiram : కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ‘ధ్రువ నక్షత్రం’ చిత్రానికి ఆది నుంచి అన్ని అడ్డంకులే. 2013లో సూర్యతో మొదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి సూర్య తప్పుకోవడంతో మాల్లో స్టార్ట్ అవ్వడానికి మూడేళ్ళ సమయం పట్టింది. 2016 లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనేక కారణాలు వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా ఒక పార్టుగా మొదలైన ఈ సినిమా చివరిగా రెండు భాగాలుగా తెరకెక్కింది.

స్పై అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్.. లాంటి పలువురు స్టార్స్ నటించారు. ఈసారి పక్క వచ్చేస్తున్నామంటూ టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ చేసి సందడి చేశారు. కానీ ఈరోజు నవంబర్ 24న కావాల్సిన ఈ మూవీని సడన్ గా పోస్టుపోన్ చేస్తున్నట్లు దర్శకుడు అనౌన్స్ చేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సమస్య రావడంతో ఈసారి వాయిదా వేయడం జరిగిందట. దీంతో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి ఒకటి రెండు రోజులు సమయం పడుతుందంటూ గౌతమ్ మీనన్ తెలియజేశారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. ప్రతి క్షణం వారితో ఆస్వాదించడం..

కాగా ఈ సినిమా తెరకెక్కించడంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని అన్ని ఎదుర్కొని గౌతమ్ మీనన్ తన డ్రీం ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు మళ్ళీ సమస్య ఎదురవ్వడంతో ఆడియన్స్ సైతం గౌతమ్ మీనన్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మీరెంత కష్టపడ్డారు ట్రైలర్, టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి ఈ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు